Illegal Affair: ప్రస్తుత జీవిన కాలంలో కొంతమంది వివాహేతర సంబంధాల వైపు మొగ్గుచూపుతున్నారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కానీ.. పరాయి స్త్రీ లేదా పురుషులతో సంబంధాలను కొనసాగిస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వివాహేతర సంబంధాల వల్ల అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో మీడియా పూర్వకంగా మనం చాలానే చూసే ఉన్నాము. ఇకపోతే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ తన భర్త అడ్డు తొలగించుకోవాలన్న…
దేశంలో ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్నే కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతుండగానే.. తాజాగా తమిళనాడులో మరో అత్యంత ఘోరమైన కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.
కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. నిందితులను కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను మరవకముందే తమిళనాడులో మరో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించి.. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో పాటు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఆగస్టు మొదటి వారంలో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా…
Khushbu Sundar: ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవికి రాజీనామా చేశారు. జూన్ 28 నుంచి అమలులోకి వచ్చే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకే ఆమె రాజీనామా చేసినట్లు వెల్లడించింది.
తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు.
Tamil Nadu: తమిళనాడు తంజావూరులో దారుణం జరిగింది. యువతిపై ఆమె స్నేహితులే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. 22 ఏళ్ల బాధిత యువతి ఇంటికి సమీపంలోనే ఆమెపై ఈ దారుణం జరిగింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మంత్రి టిఎం అన్బరసన్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఐఎడిఎంకె (AIADMK) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ మాట్లాడుతూ.. ఇటీవల రాజకీయ పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Honour killing: తమిళ నటుడు-దర్శకుడు రంజిత్ "పరువు హత్యల"పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం ఆధారంగా జరిగే పరవు హత్యల్ని హింసగా చూడలేమని అన్నారు. రంజిత్ ఇలా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఆగస్టు 9న తమిళనాడు సేలంలో తాను ఇటీవల దర్శకత్వం వహించిన ‘కవుందంపాళయం’ సినిమా గురించి విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tamil Nadu: తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని హిందూ పండగ కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్పై మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా ఫోటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.