తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కీలక చర్యలు చేపట్టింది. దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ రాష్ట్రంలోని హిజ్బ్-ఉత్-తహ్రీర్ అనే సంస్థకు చెందిన 11 మంది అనుమానిత సభ్యుల స్థానాలపై ఎన్ఐఏ దాడులు చేసింది.
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది.
Flyover Collapse Tamil Nadu Tirupattur: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంపూర్ లోని చెన్నై – బెంగళూరు జాతీయ రహదారిపై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 2023 నుంచి 4 కిలోమీటర్ల మేర హైలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతోంది. బస్ స్టేషన్ – రైల్వే స్టేషన్ మధ్య అత్యంత సమీప ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉత్తరాది రాష్ట్రాలకి చెందిన 200 మందికి పైగా…
MK Stalin: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సేవలు మరో శతాబ్దానికి అవసరం.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పార్టీ కార్యకర్తలను కోరారు.
Coimbatore: ప్రియుడితో లాడ్జ్‌కి వెళ్లిన యువతి శవమై కనిపించింది. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్‌లో చోటుచేసుకుంది. లాడ్జిలో ముఖంపై రక్తంతో యువతి కనిపించినట్లు అధికారులు ఈ రోజు తెలిపారు. రెండు రోజుల క్రితం యువతి, తన భాగస్వామితో లాడ్జికి వెళ్లింది. ప్రాథమికి నివేదికల ప్రకారం.. గీత అనే యువతి శుక్రవారం రాత్రి శరవణన్ అనే వ్యక్తితో కలిసి లాడ్జ్‌లో రూం
తమిళనాడు గవర్నర్ రవీంద్రనారాయణ రవి పెద్ద ఆరోపణ చేశారు. రాముడిని ఉత్తర భారత ఆరాధ్యదైవంగా చూపించేందుకు ప్రత్యేక కథనాన్ని రూపొందిస్తున్నారని.. దీని ఫలితంగానే యువత సాంస్కృతిక వారసత్వాన్ని కోల్పోతున్నదని అన్నారు.
Biryani: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ కార్యక్రమానికి హాజరైన ప్రజలు, అక్కడ వడ్డించిన బిర్యానీ తిని అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో బిర్యానీ తినడంతో 100 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ అయింది. అస్వస్థతకు గురైన వారిలో 40 మంది చిన్నారులతో సహా 100 మంది అస్వస్థతకు గురయ్యారు.