Tamil Nadu: ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిను తమిళక వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కలవనున్నారు.
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేశారు.
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై రాజకీయ శపథం చేశారు. గురువారం రాజకీయంగా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా పాదరక్షలు ధరించనని సవాల్ విసిరారు.
తమిళనాడులోని అరుల్మిగు కంద స్వామి ఆలయంలో ఒక భక్తుడి ఐఫోన్ ప్రమాదవశాత్తు హుండీ (విరాళం పెట్టె)లో పడింది. దీంతో నిర్వాహకులు ఇది ఆలయ ఆస్తిగా ప్రకటించారు. హుండీలో ఏ వస్తువు పడితే అది దేవుడి సొత్తుగా పరిగణిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఫోన్ తిరిగి రాకపోవడంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం.. అదే ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో ప్లస్–2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించేవాడని సమాచారం.
తమిళనాడులో మళ్లీ అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు చిగురుస్తున్నట్లు కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. దీంతో రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. తిరిగి రెండు పార్టీల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి అన్నామలై చేసిన సానుకూల వ్యాఖ్యలే కారణంగా తెలుస్తోంది.
Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10…