Pakistan: పాకిస్తాన్‌కు అంటుకున్న “ఇరాన్” మంటలు.. యూఎస్ కాల్పుల్లో 12 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఇరాన్‌లో ఖమేనీ మరణం మంటలు పాకిస్తాన్‌కు వ్యాపించాయి. పాకిస్తాన్‌లో కరాచీ, లాహోర్‌లో ఇజ్రాయిల్, అమెరికాకు వ్యతిరేకంగా ప్రజలు హింసాత్మక నిరసనలకు పాల్పడుతున్నారు. కరాచీలోని యూఎస్ ఎంబపీపై దాడులకు తెగబడ్డారు. రాయబార కార్యాలయాన్ని తగలపెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రం కావడంతో యూఎస్ కాన్సులేట్‌లోని అమెరికా సైనిక సిబ్బంది అల్లరి మూకపై కాల్పులు జరిపింది. ఈ దాడుల్లో 12 మంది మరణించారు. చాలా మంది గాయపడినట్టు తెలుస్తోంది. కరాచీలోని ఎంటీ ఖాన్ రోడ్‌లోని అమెరికా కాన్సులేట్ వెలుపల పెద్ద సంఖ్యలో నిరసనకారులు గుమిగూడడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. ఇరాన్‌లో ఆయతుల్లా ఖమేనీ,అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడంపై వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PV Sindhu: దుబాయ్‌లో నిలిచిపోయిన పీవీ సింధు.. ఎయిర్‌పోర్టులో పుణే విద్యార్థుల పడిగాపులు!
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
నిరసనకారులు ఎంబసీ కాంపౌండ్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. పరిస్థితిని నియంత్రించడానికి పాక్ పోలీసులు, అమెరిక భద్రతా దళాలు మొదట టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 12 మంది మరణించగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈఘటనపై సింధ్ హోం మినిస్టర్ జియవుల్ హసన్ లంజార్ వెంటనే కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (AIG) ఆజాద్ ఖాన్‌ను పరిస్థితిపై వివరణ కోరినట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. శాంతికి భంగం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కరాచీ పోలీసులు హెచ్చరించారు.
Price @POTUS is paying for shielding the te₹₹or nation Pakistan. Tarrifs should further be reduced for them 🤡#USEmbassy #Karachi https://t.co/ARP5PKlTMD
— Abhishek Mukherjee (@YogijiRoxx) March 1, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!