Ravichandran Ashwin: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్యోలు పలికిన టీమిండియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ కాలేజీ ఈవెంట్‌లో హిందీ భాషపై అతడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అయితే, చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ స్నాతకోత్సవానికి ఆర్. అశ్విన్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా అతడు కాసేపు విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇంగ్లీష్, తమిళ్, హిందీ భాషలు ఎంతమందికి అర్థమవుతాయని అక్కడ ఉన్నవారిని అడిగారు. హిందీ గురించి అడగ్గా కొందరి నుంచి మాత్రమే ఆన్సర్ వచ్చింది.. అప్పుడు అశ్విన్ దానిపై రియాక్ట్ అవుతూ.. ఇక్కడ మీకో ముచ్చట చెప్పాలి.. హిందీ అధికారిక భాష మాత్రమే.. జాతీయ భాష కాదని వెల్లడించాడు. దీంతో హిందీ భాషపై అశ్విన్ చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆయనపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Also: Anam Ramanarayana Reddy: టీటీడీ అధికారి సక్రమంగా విధులు నిర్వహించలేదు: దేవాదాయ శాఖ మంత్రి
ఇక, ఆ తర్వాత తన కెరీర్ గురించి మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పలు విషయాలను విద్యార్థులతో పంచుకున్నాడు. నేను చేయలేను అని ఎవరైనా నా గురించి అంటే ఖచ్చితంగా అది చేసి చూపించాలని అనుకునే వాడినని పేర్కొన్నాడు. అదే నేను చేయగలను అని ఇతరులు నమ్మితే.. దానిపై నాకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక, నిత్య విద్యార్థిగా ఉండటం అనేది ప్రతి ఒక్కరికీ జీవితంలో చాలా అవసరం. నేర్చుకున్నంత సేపూ మనల్ని ఎవరూ ఆపలేరు.. విజయం కూడా వాటంతట అదే వస్తుందని మాజీ క్రికెటర్ అశ్విన్ చెప్పాడు.
செந்தமிழ் நாடெனும் போதினிலே இன்ப தேன் வந்து பாயுது காதினிலே ❣️
இந்தி தேசியமொழி அல்ல .
கிரிக்கெட் வீரர் அஸ்வின். pic.twitter.com/MQ2monbFpr
— ச. பாலா பாலா (@SBalaBala6) January 9, 2025