Tamil Nadu: ఈరోజు (డిసెంబర్ 30) మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిను తమిళక వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ కలవనున్నారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని అత్యాచార ఘటనపై ఇప్పటికే లేఖన విడుదల చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాను అని అందులో పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించిన ఎలాంటి ప్రయోజనం లేదు అని విజయ్ చెప్పుకొచ్చారు. కాగా, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యారంటూ లేఖ విడుదల చేసిన తర్వాత విజయ్ గవర్నర్ ను కలవడంపై తమిళనాడు ఆసక్తికర చర్చ కొనసాగుతుంది.
Read Also: Taliban: ఇళ్లల్లోని వంట గదులకి కిటికీలు పెట్టొద్దు.. తాలిబన్లు కొత్త నిబంధన!
కాగా, అన్నా యూనివర్సిటీలో చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు లైంగిక దాడి చేశారు. తన ప్రియుడితో మాట్లాడుతుండగా.. ఇద్దరు వ్యక్తులు వచ్చి.. ప్రియుడిని కొట్టి, విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. డిసెంబర్ 23వ తేదీన సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక, రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన కేసును మద్రాస్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. వివరణాత్మక నివేదిక దాఖలు చేయాలని తమిళనాడు సర్కార్ తో పాటు పోలీసులకు ఆదేశించింది. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలు, విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు పేర్కొనింది.