Live-in relation: తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో తండ్రి, కూతురు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. చాలా నెలల క్రితమే వీరిద్దరు చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఫిర్యాదు చేయడంతో, ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ ఘటనలో హత్య-ఆత్మహత్య కోణంలో విచారణ సాగిస్తున్నారు. Read Also: Karnataka: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది.. అయితే, ఈ మరణాలతో సంబంధం ఉన్నట్లు…
NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. చెన్నై, మైలాడుతురై సహా 25 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం.
Olive Ridley turtles: తూర్పు తీరం తాబేళ్ల మృత్యుకుహరంలా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సముద్ర తాబేళ్లు డిసెంబరు ఏప్రిల్ మధ్య గుడ్లు పెట్టేందుకు హిందూ మహాసముద్రంలోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ జలాల నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల వైపు వస్తుంటాయి. ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రాణం పోసుకున్న బుల్లి తాబేళ్లు, అటుపోట్ల సమయంలో సముద్రంలోకి జారుకొని జీవనం సాగిస్తాయి.
Ajith Kumar : కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన పద్మ అవార్డులను ప్రతి సంవత్సరం వివిధ రంగాలకు చెందిన వారికి అందజేస్తున్నారు. విద్య, సాహిత్యం, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, పరిశ్రమ వంటి వివిధ రంగాల్లో సాధించిన వారికి కూడా ఇస్తారు. ఆ విధంగా 2025లో మొత్తం 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. దీని ప్రకారం 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. 23 మంది మహిళలు…
కిడ్నీ రాకెట్ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారు. ఏడుగురు అరెస్ట్ ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు సీపి సుధీర్ బాబు తెలిపారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. "అరెస్ట్ అయినవారిలో జనరల్ సర్జన్ డాక్టర్ సిద్ధంశెట్టి అవినాష్, అలకనంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గుంటుపల్లి సుమంత్ కర్ణాటకకు చెందిన మధ్యవర్తి ప్రదీప్‌లతో పాటు ఆస్పత్రి సిబ్బంది గోపి, రవి, రవీందర్, హరీష్, సాయిలును అరెస్ట్ చేశాం.
Inter University Games: పంజాబ్‌లో జరిగిన అంతర్-విశ్వవిద్యాలయ కబడ్డీ మ్యాచ్ సందర్భంగా తమిళనాడు మహిళా కబడ్డీ క్రీడాకారిణులపై దాడి జరగడం కలకలం రేపింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన క్రీడా ప్రపంచానికి చేదు అనుభవంగా మిగిలింది. మ్యాచ్ రెఫరీ తీసుకున్న నిర్ణయం పట్ల క్రీడాకారులు అసంతృప్తిగా ఉండటంతో ఈ గొడవ ప్రారంభమైందని సమాచారం. మదర్ థెరిసా విశ్వవిద్యాలయం, పెరియార్ విశ్వవిద్యాలయం, అలగప్ప విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయాలకు చెందిన మహిళా క్రీడాకారిణులు పంజాబ్‌లో నిర్వహించిన ఉత్తర మండలం అంతర్…
Dead Body On Bicycle: తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల బాలన్ తన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి శివగామి (65) మృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లాడు. గత నాలుగేళ్లుగా శివగామి తన కొడుకు బాలన్‌తో కలిసి సైకిల్‌పై తిరుగుతూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేది. కాకపోతే, ఈసారి ఆమె మరణం తరువాత కూడా అతని తల్లిని సైకిల్ పై జాగ్రత్తగా తీసుకెళ్లిన ఈ దృశ్యం ప్రజల…
Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయ కొండపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కానీ మాంసాహారం తిన్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. దీనిపై రామనాథపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేసిన అభియోగాలను నిరూపించలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.