ఫెంగల్ తుఫాను తమిళనాడులో పెను విధ్వంసం సృష్టించింది. తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. తిరువణ్ణామలై, విల్లుపురం, పుదుచ్చేరి వరదలతో అతలాకుతలమయ్యాయి. తిరువణ్ణామలైలో పలు ఇళ్ళుపై కొండ చరియలు విరిగి పడ్డాయి. 25 మంది పెద్దవారు, ఐదుగురు పిల్లలు వరకు కొండచరియలు కింద ఇరుక్కు పోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఫంగల్ తుఫాను ఇప్పటికీ సముద్ర తీర ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. అయితే తుఫాను తమిళనాడులోని విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు కారణమైంది. దీని కారణంగా.. చైన్నై నగరంలో ఇండిగో విమానం తృటిలో క్రాష్ ల్యాండింగ్ను నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను ఢీకొట్టేందుకు యత్నించింది.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
Thirumangai Alwar Idol: దశాబ్ధాల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుంచి చోరీకి గురైన, కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని యూకే భారత్కి అప్పగించనుంది.
Tamil Nadu: తమిళనాడులోని ఓ కుటుంబంలోని ముగ్గురి హత్య ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కార్తీ మూవీ ‘‘ఖాకీ’’లాగే ఫామ్ హౌజ్లో ఈ హత్యలు జరిగాయి. చోరికి పాల్పడేందుకు వచ్చిన దొంగలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుప్పూర్లోని పొంగలూర్లో కుటుంబలోని ముగ్గురు దారణహత్యకు గురయ్యారు.
Cyclone Fengal: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈరోజు (బుధవారం) తుఫానుగా మారుతుంది. దీంతో తమిళనాడు, పుదుచ్చరిలకు భారత వాతవావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు.
తమిళనాడు రాష్ట్రం తిరుచెందూర్లోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం 25 ఏళ్ల దేవనై అనే ఆలయ ఏనుగు తన కొమ్ముతో దాడి చేసి ఒకరిని చంపింది. ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3.30 గంటలకు దాని షెడ్లో జరిగింది. మహౌత్ ఉదయ కుమార్, అతని బంధువు శిశుబాలన్ ఏనుగుకు పండ్లను తినిపిస్తుండగా ఏనుగు ఒక్కసారిగా రెచ్చిపోయి దాడి చేసింది.
Interesting News: తమిళనాడు మధురైలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. 1997లో రూ.60ని దొంగిలిచిన వ్యక్తిని 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ప్రత్యేక పోలీసుల బృందం గుర్తించింది. శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వం అనే వ్యక్తిని మధురై జిల్లా పోలీసులు అరెస్ట్ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ కేసును గుర్తించేందుకు అసిస్టెంట్ కమిషనర్ సూరకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12-15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత 24 గంటల్లో వాతావరణ నివేదిక ప్రకారం.. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉదయం దట్టమైన నుంచి చాలా దట్టమైన పొగమంచు నమోదైంది.