రన్నింగ్ ట్రైన్ ఎక్కడం గానీ.. దిగడం గానీ ప్రమాదం అని రైల్వేస్టేషన్లలో అనౌన్సెమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతూనే ఉంటారు. ఇందుకు మూల్యంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
Tamil Nadu: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా, అలాగే కొత్త ఏడాదిలో రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు భారీగా ఆర్థిక, సామగ్రి సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.3,000 నగదు సహాయంతో పాటు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పొంగల్ గిఫ్ట్ హ్యాంపర్ అందజేయనున్నారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ జనవరి రెండో వారం ప్రారంభించనున్నారు. Sabarimala Gold Theft:…
Sons Kill Father: చెన్నైలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మూడు కోట్ల రూపాయల బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేసిన ఘటన తిరువళ్లూరు జిల్లా పోదటూరుపేటలో వెలుగులోకి వచ్చింది. అప్పులు, జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడ్డారు.
Thiruparankundram Lamp Row: తమిళనాడులో తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి ఆలయ దీపం వివాదం ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న ఆలయం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, డీఎంకే ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనిపై వివాదం మొదలైంది. అయితే, ఆలయం వద్ద అధికారులు దీపం వెలిగించేందుకు అనుమతించకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని చెబుతూ 40 ఏళ్ల వ్యక్తి మధురైలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియోను రికార్డ్ చేశాడు.
టీవీకే అధినేత, నటుడు విజయ్ మరోసారి తమిళనాడులో భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత రాష్ట్రంలో తొలిసారి భారీ ర్యాలీ చేపడుతున్నారు. గురువారం ఈరోడ్ జిల్లాలోని విజయమంగళం టోల్ గేట్ దగ్గర ప్రజలను ఉద్దేశించి విజయ్ ప్రసంగించనున్నారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగానే కమలనాథులు కసరత్తు ప్రారంభించారు. బీహార్లో ఘన విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న నాయకులు... త్వరలో జరగనున్న ఎన్నికల రాష్ట్రాలపై దృష్టి పెట్టారు.
SIR: కేంద్రం ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేసేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పొడగించినట్లు ఎన్నికల సంఘం ఈ రోజు వెల్లడించింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో గడవును పొడగించింది.
TVK Party: నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. పుదుచ్చేరిలో మంగళవారం (డిసెంబర్ 9న) నిర్వహించనున్న రాజకీయ సభకు ఆంక్షలు విధించారు.
MK Stalin: తమిళనాడులో మరోసారి గవర్నర్ వర్సెస్ సీఎం వివాదం మొదలైంది. గవర్నర్ అధికార నివాసమైన ‘‘రాజ్ భవన్’’ పేరును ‘‘లోక్ భవన్’’గా మార్చాలనే ప్రతిపాదనపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ పేరు మార్పు సిఫార్సు చేశారు.
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివగంగై జిల్లాలోని కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించారు. 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిని శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుపత్తూర్ ప్రాంతంలోని పిళ్లైయార్పట్టికి 5 కి.మీ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. Read Also: Madhya Pradesh: ఆదర్శంగా సీఎం కుమారుడు..…