Chennai: చెన్నెలోని తలపతి వీధి పక్కన ఉన్న కుంద్రత్తూర్ లోని మూడవ వార్డులో విజయ్ (25) అనే యువకుడు అద్దె ఇంట్లో ఉంటున్నాడు. విజయ్ చెన్నెలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేశాడు. తనతో పాటు పనిచేసే యువశ్రీ (24) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని కుంద్రత్తూర్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు.
స్మార్ట్‌వాచ్‌తోనే షాపింగ్ పేమెంట్స్.. బోట్ ‘వేవ్ ఫార్చ్యూన్’ ధమాకా ఫీచర్లు..!
రాత్రి ఇద్దరూ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో, ఆ నవ వధువు చెల్లెలు వెళ్లి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. చాలాసేపటి వరకు తలుపు తెరవకపోవడంతో కుంద్రత్తూర్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఇంట్లో మంచం మీద యువశ్రీ చనిపోయి ఉండటాన్ని, విజయ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూసి పోలీసులు షాక్ అయ్యారు.
ఇద్దరి మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించి దర్యాప్తు చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ ఇద్దరికీ పెళ్లైన వారం రోజులకే అభిప్రాయ భేదాలు తలెత్తాయని పోలీసులు చేసిన దర్యాప్తులో వెల్లడైంది. ఈ కారణంగా.. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో.. భర్త కోపంతో.. క్షణికావేశంలో తన భార్యను చంపి, ఆపై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.
Maruti eVX vs Hyundai Creta EV.. రేంజ్, ఫీచర్ల పరంగా ఏ ఎలక్ట్రిక్ SUV బెస్ట్?
ఈ సంఘటనకు వేరే కారణం ఉందా అనే కోణంలో కూడా కుంద్రత్తూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ జంట మరణించడం దిగ్భ్రాంతిని కలిగించింది. యువశ్రీ శరీరంపై ఎటువంటి గాయాలు లేనప్పటికీ, ఆమె ముఖంపై దిండు లాంటి వస్తువును ఉపయోగించడం వల్ల ఆమె ఊపిరాడక చనిపోయి ఉండవచ్చనే కోణం నుంచి వారు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎంతో అన్యాయంగా ఒకే కంపెనీలో పని చేస్తూ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇరువురు ఇలా మృతి చెందడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రులు.