తమిళనాడు వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నై ఎయిర్పోర్టులోకి వరద నీళ్లు చేరడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దీపావళి పండుగ వేళ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యవహార శైలి రాజకీయ దుమారం రేపుతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని ఆ విశ్వాసం ఉన్నవారికి మాత్రమే దీపావళి శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మహిళలపై అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పుడే అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. తాజాగా డీఎంకేను ఉద్దేశించి అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Supreme Court: తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న అవయవాల అక్రమ రవాణా, అక్రమ కిడ్ని మార్పిడి కేసులపై సీబీఐ (CBI) దర్యాప్తునకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు ఈరోజు ( అక్టోబర్ 10న) నిరాకరించింది.
S*exual Assault: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కుంభకోణం సమీపంలోని ఒక ఆలయం లోపల 13 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ఆలయ పూజారి లైంగిక వేధింపులకు పాల్పడినందుకు అతడిపై పోక్సో చట్టం కేసు నమోదు అయింది.
Cough syrup: ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందు 21 మంది చిన్నారులను బలి తీసుకుంది. ఆరోగ్యాన్ని నయం చేయాల్సిన మందు, పిల్లల ప్రాణాలను తీసింది. కోల్డ్రిఫ్ దగ్గు మందు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణాల నేపథ్యంలో మధ్యప్రదేశ్తో సహా పలు రాష్ట్రాలు ఈ మందును నిషేధించాయి.
Vijay: తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత, స్టార్ యాక్టర్ విజయ్ నిర్వహించిన ర్యాలీ విషాదకరంగా ముగిసింది. కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
TVK Vijay vs Police: తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ కొనసాగుతుంది. తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్, డీఎంకే చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది.