Tamil Nadu Video: రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడ్డ మహిళ.. సిబ్బంది ఏం చేశారంటే..!
- రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడ్డ మహిళ
- సకాలంలో స్పందించి కాపాడిన సిబ్బంది
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రన్నింగ్ ట్రైన్ ఎక్కడం గానీ.. దిగడం గానీ ప్రమాదం అని రైల్వేస్టేషన్లలో అనౌన్సెమెంట్ చేస్తూ ఉంటారు. అయినా కూడా కొందరు ప్రయాణికులు పెడచెవిన పెడుతూనే ఉంటారు. ఇందుకు మూల్యంగా ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే తమిళనాడులో చోటుచేసుకుంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఓ మహిళా ప్రయాణికురాలు ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: California Floods: కాలిఫోర్నియాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
డిసెంబర్ 20న తమిళనాడులోని తాంబరం రైల్వే స్టేషన్‌లో రైలు వేగంగా కదులుతోంది. అయితే ఒక మహిళ రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. కానీ పట్టు తప్పి పట్టాల కిందకు జారిపోబోతుండగా రైల్వే ఉద్యోగి నితీష్ కుమార్ సకాలంలో స్పందించి కాపాడాడు. ఈ గందరగోళం మధ్య ట్రైన్ కూడా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్ సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగికి ప్రశంసలు అందుతున్నాయి. శభాష్ అంటూ కొనియాడుతున్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో ఘోర ప్రమాదం. 17 మంది సజీవ దహనం
లోకల్ ట్రైన్ బీచ్ వైపు వెళ్తుండగా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ తెలిపింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న నితీష్ కుమార్ వెంటనే చర్య తీసుకుని మహిళ ప్రయాణికురాలను సురక్షితంగా పైకి లాగి కాపాడినట్లు వెల్లడించింది.
Swift alertness by Shri Nithish Kumar, Ticket Checking Staff (CCTC/TBM), at Tambaram on 20.12.2025, saved a lady passenger who accidentally slipped while boarding a Beach-bound train.
His timely action and presence of mind averted a serious accident, reflecting exemplary… pic.twitter.com/qRhNsgLcrA
— Southern Railway (@GMSRailway) December 22, 2025
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!