Tamil nadu: తమిళ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకుంది. కరూర్‌లో ఈరోజు విజయ్ నిర్వహించిన ర్యాలీకి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సమయంలోనే తొక్కిసలాట జరిగింది. మొత్తం 10 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
టీవీకే చీఫ్ విజయ్‌కు చుక్కెదురైంది. సీఎం స్టాలిన్, కుటుంబ సభ్యులపై కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విజయ్‌పై తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో డీఎంకే న్యాయవాది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tamil Nadu: పరువు హత్యలకు తమిళనాడు కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చాలా పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. తమిళనాడు మైలదుత్తురై జిల్లాలోని ఆదియమంగళంలో జరిగిన దళిత యువకుడు వైరముత్తు హత్య కేసులో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నాయకుడు కేఎస్.అళగిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ దక్షిణాదికి వస్తే చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Vijay: తమిళగ వెట్రీ కజగం (టీవీకే) చీఫ్, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ శనివారం తన రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి తన తొలి రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో డీఎంకేలు రెండూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. వారు ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని అన్నారు. రాజులు యుద్ధానికి వెళ్లే ముందు దేవాలయాల్లో ప్రార్థనలు చేసినట్లుగా, 2026 ప్రజాస్వామ్య యుద్ధానికి సిద్ధమయ్యే ముందు ప్రజలను కలవడానికి వచ్చానని…
Crime News: తమిళనాడు రాష్ట్రంలో సంచలన సంఘఠన చోటు చేసుకుంది. కళ్లకురిచ్చి జిల్లా మలైకొట్టాళం గ్రామానికి చెందిన కొళంజి అనే వ్యక్తి తన భార్య గీతాతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, ఈ మధ్య భార్య గీతాకు అదే గ్రామానికి చెందిన తంగరసు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం కొళంజి తన ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా భార్య గీతా, ప్రియుడు తంగరసును ఉండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దింతో ఆగ్రహానికి…
కొందరు ఏలాంటి పని దొరక్కొ. . దొంగతనం వృత్తిగా భావించి చోరీలకు పాల్పడుతారు. కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన జరిగింది. చోరీలు చేస్తే వచ్చే ఆనందం కోసమే..15 ఏళ్లుగా చోరీలు చేస్తున్నానని తెలిపింది ఓ మహిళ.. పూర్తి వివరాల్లోకి వెళితే… తమిళనాడుకు చెందిన ఓ గ్రామ పంచాయతీ సర్పంచి. 15 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నది. చివరకు ఆమె పోలీసులకు దొరికి పోయారు. చెన్నై నెర్కుండ్రానికి చెందిన వరలక్ష్మి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె మెడలోని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముగింట అన్నాడీఎంకేలో విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్‌పై మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి యాక్షన్ తీసుకున్నారు. పార్టీ పదవుల నుంచి తొలగించారు.