Tamil Nadu: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మంత్రి కె. పొన్ముడి మరో వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పలువురు ప్రముఖులతో పాటు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో డీఎంకే పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే, ఓ కార్యక్రమంలో మంత్రి పొన్ముడి మాట్లాడుతూ.. సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందని అసభ్యకర పదజాలాన్ని వాడారు. ఇదంతా జోక్ అని పేర్కొన్నాడు. ఇక, అతడు మాట్లాడిన తీరు మహిళలను కించపర్చేలా ఉండటంతో.. అతడిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: Vodka Flavours: వోడ్కా లవర్స్‌కి గుడ్ న్యూస్.. సరికొత్త ఫ్లేవర్‌తో డ్రింక్..
కాగా, బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌పై ప్రశ్నిస్తూ.. ‘‘మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థమేంటో నాకంటే బాగా మీకే తెలుసు అని పేర్కొన్నారు. ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను మీ ఇంట్లోని మహిళలు ఒప్పుకుంటారాని అడిగింది. ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఇలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని చెప్పుకొచ్చింది. అలాగే, డీఎంకే ఎంపీ కనిమొళి కూడా మంత్రి పొన్నుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. కారణం ఏదైనా సరే.. మహిళలపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలను ఖండించాల్సిందే అన్నారు. ఇది వివాదం కావడంతో పొన్ముడిని డీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పోస్ట్ నుంచి తప్పించింది.
என்ன ஒரு கேவலமான ஜென்மம்…
இந்த கருமத்துல இது அமைச்சர்….🤮🤮🤮 pic.twitter.com/XBrR0sPZEY— john ravi. (@johnravi1974) April 10, 2025
Mr @mkstalin avl, this is your Minister, an education minister for that. Such a disgusting mindset he has and his words describe him better than what i can say. Will you ever have the guts to throw him out of his chair and position? Or you and your party find sadistic pleasures… https://t.co/vqFMWpyXs0
— KhushbuSundar (@khushsundar) April 10, 2025
அமைச்சர் பொன்முடி அவர்களின் சமீபத்திய பேச்சு ஏற்றுக்கொள்ள முடியாதது. எந்த காரணத்திற்காகப் பேசப் பட்டிருந்தாலும் இப்படிப்பட்ட கொச்சையான பேச்சுகள் கண்டிக்கத்தக்கது.
— Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) April 11, 2025