తమిళనాడు మంత్రి కె.పొన్ముడి హద్దులు దాటి ప్రవర్తించారు. తన స్థాయి మరిచి నీచానికి ఒడిగట్టారు. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన మంత్రే.. స్థాయి మరిచి జోక్‌లు వేశారు. పబ్లిక్ మీటింగ్‌లో స్త్రీ, పురుషులు ఉన్నారన్న ఇంకిత జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడారు. దీంతో డీఎంకే అధిష్టానం సీరియస్ అయి మంత్రి పదవి నుంచి పొన్ముడిని తొలగించింది.
ఇది కూడా చదవండి: Vodka Flavours: వోడ్కా లవర్స్‌కి గుడ్ న్యూస్.. సరికొత్త ఫ్లేవర్‌తో డ్రింక్..
తమిళనాడు అటవీ మంత్రి, డీఎంకే సీనియర్ నాయకుడు కె పొన్ముడి ఒక బహిరంగ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతుండగా.. హిందూ తిలకాలపై జోక్‌లు పేల్చారు. తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Bengaluru: పార్కులో ఏకాంతంగా ఉన్న జంటపై దాడి.. ప్రభుత్వం సీరియస్
అంతేకాకుండా డీఎంకే ఎంపీ కనిమొళి కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని మండిపడ్డారు. ప్రసంగానికి కారణం ఏదైనా గానీ ఏ మాత్రం క్షమించకూడదన్నారు. అలాగే సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో డీఎంకే నేతలు ఆనందం పొందుతారా? లేదంటే పదవి నుంచి తొలగిస్తారా? అంటూ నిలదీశారు. అంతేకాకుండా ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పొన్ముడి వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో డీఎంకే అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పొన్నుడిని మంత్రి పదవి నుంచి తొలగించింది. అంతేకాకుండా పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు అన్ని పదవుల నుంచి తొలగించింది. పొన్ముడి స్థానంలో తిరుచ్చి ఎన్ శివను నియమించింది.
ఇది కూడా చదవండి: CSK Captains: ధోనీ టు రుతురాజ్.. సీఎస్‌కే కెప్టెన్స్ లిస్ట్ ఇదే! మూడుసార్లు మహీనే