Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నంటున్నట్లు కే. అన్నామలై ప్రకటించారు. తనకు తానుగా ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు చెప్పారు. పార్టీకి మంచి భవిష్యత్తు కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళనాడులో కాషాయ పార్టీకి కొత్త ఊపు తీసుకువచ్చిన నేతల్లో అన్నామలై కీలకంగా వ్యవహరించారు.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నీట్ ప్రవేశ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ పంపిన వ్యతిరేక బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్టాలిన్ వెల్లడించారు.
Tamil Nadu: సమ్మర్ హాలిడేస్ రావడం, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఊటీ, కొడైకెనాల్ వెళ్తామనుకుంటున్న వారికి తమిళనాడు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రెండు ప్రాంతాల్లో ఈ-పాస్ విధానం అమలు చేయడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నుంచి వెళ్లిన పర్యాటకులకు ఈ -పాస్ విధానం గురించి తెలియక చిక్కుకుపోయారు. మరోవైపు, ఈ విధానంపై స్థానిక వ్యాపారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్యానంద.. ఈ పేరు తెలియని వారుండరు. స్వయం ప్రకటిత ‘దేవుడి’గా ప్రకటించుకున్నారు. అయితే తాజాగా తమిళనాడు మీడియాలో నిత్యానంద చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ మీడియాకు సందేశం పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్ టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. ఓ వైపు పరీక్షల కాలం ముగియతుండడం.. ఇంకోవైపు సమ్మర్ కావడంతో చల్లదనం కోసం ఊటీకి వెళ్తున్నారు. అయితే అక్కడ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ విషయం తెలియక వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Pamban Bridge: తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జిను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
MK Stalin: తమిళనాడు ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి ఇటీవల ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రెండు పార్టీల మధ్య మళ్లీ పొత్తు చిగురించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ భేటీపై సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తున్న సమయంలో అసెంబ్లీలో లేకపోవడాన్ని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లు…
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ ఆరోపణలను అమిత్ షా కొట్టిపారేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు.
Tamil Nadu: వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డీఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నాడీఎంకేలు తమ తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే, తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సీఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది.
జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్రం, కొన్ని రాష్ర్ట ప్రభుత్వాల మధ్య వివాదం సాగుతున్న విషయం విదితమే. తాజాగా వీటిని వ్యాతిరేకిస్తూ.. తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానాలు చేసింది. శుక్రవారం తిరువన్మయూర్లో వియజ్ ఆధ్వర్యంలో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశానికి హాజరైన విజయ్ ప్రసంగించారు.