Tamil Nadu: తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని సెంగుట్టైలో గల ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం రావడంతో క్లాస్ రూమ్ బయట కూర్చొని సైన్స్ పరీక్ష రాయవలసి పరిస్థతి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, ఈ అంశంపై ఆ చిన్నారి తల్లి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఏమి జరిగిందని ప్రశ్నించగా.. తనకు పీరియడ్స్ రావడంతో ప్రిన్సిపాల్ తరగతి గది బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Nandamuri : ‘బాల’ బాబాయ్ తో కలసి నటిస్తాను : కళ్యాణ్ రామ్
ఇక, ఈ అవమానకరమైన ఘటనతో విద్యార్థి తల్లి సదరు ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కి ప్రశ్నించగా.. నిర్లక్షపూ సమాధానం ఇవ్వడంతో స్థానిక పోలీసులతో పాటు మహిళా సంక్షేమ శాఖ, జిల్లా మేజిస్ట్రేట్, జిల్లా పాఠశాలల ఇన్‌స్పెక్టర్ లకు కూడా బాధిత బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయంపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఏడాది జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని బాలికల పాఠశాలలో 11వ తరగతి విద్యార్థిని పరీక్ష రాస్తుండగా పీరియడ్స్ రావడంతో క్లాస్ టీచర్ ను శానిటరీ నాప్‌కిన్ అడిగినందుకు గంట సేపు క్లాస్ బయటకు పంపించినట్లు ఆరోపణలు వచ్చాయి.