టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. జనవరి 12న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ను విచారించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: US-Pakistan: ఆపరేషన్ సిందూర్ ఆపేందుకు అమెరికాలో పాక్ లాబీయింగ్.. వెలుగులోకి..!
తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ర్యాలీలో భాగంగా సెప్టెంబర్ 27, 2025లో కరూర్‌లో బహిరంగ సభ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనం సృష్టించింది. అనంతరం బాధిత కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించారు. ఇక కరూర్ తొక్కిసలాట తర్వాత విజయ్ సభలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు