Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ
- స్టాలిన్ సర్కార్ గుడ్‌న్యూస్
- అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా
- ఖాతాల్లో రూ.5 వేలు జమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మహిళలకు స్టాలిన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలకు బొనాంజా అందించింది. మహిళల ఖాతాల్లో రూ.5,000 చొప్పున జమ చేసింది. శుక్రవారం ఉదయమే 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు నగదు జమ అయింది. ఉదయాన్నే మొబైల్ చూసిన మహిళలు నగదు జమ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: కుక్కల బెడదపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
స్టాలిన్ ప్రభుత్వం కలైంగర్ మహిళా హక్కుల పథకం కింద ప్రతి నెల రూ.1,000 అందిస్తుంది. ఇప్పుడు ఈ పథకాన్ని రూ.2,000కు పెంచింది. ఇంతలోనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన 3 వేలతో పాటు వేసవి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.2 వేలు జత చేసి మొత్తంగా శుక్రవారం ఉదయం రూ.5,000 చొప్పున మహిళల ఖాతాల్లో జమ చేసింది. 1.31 కోట్ల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఉదయం రూ. 5,000 జమ చేయబడింది.
ఇది కూడా చదవండి: Bangladesh Poll Results: తారిక్ రెహమాన్‌దే బంగ్లాదేశ్
‘‘తమిళనాడు మహిళలకు.. ఈ మహిళా హక్కుల గ్రాంట్ స్టాలిన్ ఇచ్చిన హామీ. ఎవరు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినా నేను దాని నుంచి వెనక్కి తగ్గను. ఎన్నికలను ఒక కారణంగా చూపుతూ మూడు నెలలుగా మహిళా హక్కుల గ్రాంట్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మన ద్రవిడ మోడల్ ప్రభుత్వం వారికంటే ముందుగానే వ్యవహరించింది!. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు ముందస్తుగా రూ. 3,000, రూ. 2,000 వేసవి ప్రత్యేక ప్యాకేజీతో పాటు! కలైంగర్ మహిళా హక్కుల పథకం యొక్క 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ఉదయం మొత్తం రూ. 5,000 జమ చేయబడింది. ద్రవిడ మోడల్ 2.0 కింద మేము రూ. 1,000 మహిళా హక్కుల గ్రాంట్‌ను రూ. 2,000కి పెంచుతాము! ఇది కరుణానిధి స్టాలిన్ నా సోదరీమణులకు ఇచ్చే వాగ్దానం!.’’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఆదివారం ఎన్నికల సంఘం తమిళనాడులో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. అనంతరం సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. తమిళనాడుతో పాటు కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం షెడ్యూల్ కూడా విడుదల కానున్నాయి.
Tamil Nadu CM MK Stalin tweets, "For the women of Tamil Nadu, this Women’s Rights Grant is the promise given by Stalin. No matter who tries to create obstacles, I will not step back from it.
Citing the elections as a reason, they are trying to block the Women’s Rights Grant for… pic.twitter.com/33um1kd69T
— ANI (@ANI) February 13, 2026
#WATCH | Tamil Nadu CM MK Stalin announces major outreach for women.
"Rs 5000 has been credited this morning to 1.31 crore Kalaignar women's rights scheme beneficiaries as well": DMK
(Video Source: DMK) pic.twitter.com/f9gbj8dMjr
— ANI (@ANI) February 13, 2026
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!