Shocking: తమిళనాడు కడలూరు జిల్లాలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధుడిని నడిరోడ్డపై పెట్రోల్ పోసి తగలబెట్టడం, అతను సాయం కోసం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వేడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. జిల్లాలోని పణ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టు గ్రామానికి చెందిన రాజేంద్రన్(70) అనే జీడిపప్పు రైతును ఆమె కోడలు, ప్రియుడు కలిసి కుట్ర చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
Read Also: Border 2 : ‘బోర్డర్’ సినిమాలకు థియేటర్లో పెను ప్రమాదం!
శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కందన్‌తో కలిసి బైక్‌పై మాలిగం పట్టు రోడ్డులో వెళ్తుండగా, అకస్మాత్తుగా కారుతో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మంటలతోనే రాజేంద్రన్ కేకలు వేస్తూ, సాయం కోరాడు. చివరకు అతడికి అంటుకున్న మంటల్ని స్థానికులు ఆర్పివేసి, స్థానిక ఆస్పత్రికి తరలించారు. 70 శాతం కాలిన గాయాలతో ఆయన కడలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మణికందన్(39), కుపేంద్రన్(29), పార్థిబన్(28)లను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో రాజేంద్రన్ కొడుకు భూపతితో జయప్రియా(28)కి వివాహం జరిగింది. వీరికి 9 ఏళ్ల కుమారుడు, 7 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భూపతి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి కోడలు జయప్రియా మామ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే మణికందన్‌తో జయప్రియాకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాజేంద్రన్ కోడల్ని తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. మణికందన్‌కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్‌ను హత్య చేయాలని కుట్ర పన్నారు. మణికందన్ తన స్నేహితులతో కలిసి రాజేంద్రన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు వెల్లడించారు.