Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలతో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా కోరిక మేరకు చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు చెక్ రిపబ్లిక్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిఖిల్ గుప్తా కుటుంబం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది.
Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసులో నిన్న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాదాస్పద స్థలంలో షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు అంగీకరించింది. అయితే ఈ తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వేపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు ఆర్డర్‌పై స్టే ఇవ్వలేమని చెప్పింది. మధురలోని షాహీ ఈద్గా కాంప్లెక్స్‌పై శాస్త్రీయ సర్వే నిర్వహించడానికి అలహాబాద్ హైకోర్టు నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్ ని…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమే అని, ఇది దేశంలో అవిభాజ్య అంతర్భాగమని చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది.
అయితే ఈ తీర్పుపై దాయాది దేశం పాకిస్తాన్ తన అక్కసు వెల్లగక్కుతోంది. ఇప్పటికే తీర్పుకు విలువలేదని పాకిస్తాన్ అభివర్ణించగా.. దాని మిత్రదేశం చైనా, కాశ్మీర్ అంశాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. ఇదిలా ఉంటే పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉందని.. న్యాయస్థానం తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్.కే సింగ్ వెల్లడించారు.
ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది విచారణ.. ఈ రోజు మరోసారి విచారణకు రానుంది చంద్రబాబు పిటిషన్
జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించడం విచారకరం అని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము - కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు.
గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన…
'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.