Supreme Court: బిల్కిస్ బానో కేసులో మొత్తం 11 మంది దోషులు ఈ నెల 21వ తేదీ లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి పొడిగింపు కోసం వాళ్లు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసిన కేసులో తొమ్మిది మంది దోషులు లొంగిపోవడానికి మరింత సమయం కావాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Rohit-Kohli: విరాట్ కోహ్లీకి ఆ పదం అస్సలు నచ్చదు: రోహిత్
అయితే, ఈ కేసులో దోషుల అభ్యర్థనను తోసిపుచ్చిన జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఆదివారం నాటికి తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది. అయితే, అంతకుముందు, నిందితులలో ఒకరైన గోవింద్‌భాయ్.. తన 88 ఏళ్ల తండ్రి, 75 ఏళ్ల తల్లిని చూసుకునే బాధ్యత నాపైఉంది.. తన తల్లిదండ్రులకు ఏకైక సంరక్షకుడనని ఆయన పేర్కొన్నాడు. దాని వల్ల గడువు పొడిగించాలని ఆయన కోరాడు.. మరో దోషి రమేష్ రూపాభాయ్ చందనా తన కుమారుడి పెళ్లికి ఆరు వారాల పాటు సమయం కావాలని కోరాగా.. మూడవ నిందితుడు మితేష్ చిమన్‌లాల్ భట్ కూడా ఆరు వారాల పొడిగింపు కావాలని అభ్యర్థించాడు. శీతాకాల పంట కోతకు సిద్ధంగా ఉందని పేర్కొన్నాడు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం నిందితుల పిటిషన్ ను కొట్టివేసి.. నిందితులందరూ ఈ నెల 21లోగా లొంగిపోవాలని గడువు ఇచ్చింది.
Read Also: Jupally Krishna Rao: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు..
ఇక, ఈ శిక్ష కాలాన్ని తగ్గిస్తూ గతేడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగానే నిందితులను రిలీజ్ చేసింది. అయితే.. నిందితులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెల్లడించింది. దోషులు మళ్లీ జైలులో జనవరి 21లోగా లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.