కేంద్ర ప్రభుత్వంలోని మోడీ సర్కార్ గత డిసెంబర్ లో క్రిమినల్ చట్టాల పేర్లను మార్చింది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. తనకు హిందీ రాదని కొత్త న్యాయ చట్టాలను ఇండియన్ పీనల్ కోడ్(IPC), ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్(CRPC), అలాగే, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను వాటి అసలు పేర్లతో పిలుస్తూనే ఉంటానని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వెల్లడించారు.
Read Also: Instagram Reels: ఫ్రీ చాక్లెట్స్ ఎలా తినాలో రీల్ చేశాడు.. చివరకు ఏమైందంటే..
ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఈ కామెంట్స్ చేశాడు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దామోదరన్ ఇండియన్ సివిల్ ప్రొటెక్షన్ కోడ్‌కు కొత్తగా పెట్టిన భారతీయ నాగరిక్ సురక్ష సంహితగా చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఆ సయమంలో దామోదరన్ ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ సరిగ్గా చెప్పలేకపోయారు.. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న జస్టిస్ ఆనంద్ వెంకటేష్.. తనకు హిందీ భాష రాదని క్రిమినల్ చట్టాల గురించి ఐపీసీగా మాట్లాడతానని చెప్పారు.
Read Also: Fake Loan Apps: సోషల్ మీడియాలో ఫేక్ లోన్ యాప్స్ .. రంగంలోకి దిగిన ప్రభుత్వం
అయితే, శీతకాల పార్లమెంట్ సమావేశాల్లో ఐసీపీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టారు. ఐసీపీని ఇండియన్ జ్యుడీషియల్ కోడ్‌గా, సీఆర్‌పీసీని ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్‌గా మార్పులు చేసింది. గతంలో ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు సైతం ఆనంద్ వెంకటేష్‌ను అభినందించింది. అలాగే, తమిళనాడు మంత్రి పొన్నమడిపై ఉన్న అవినీతి కేసును జస్టిస్ వెంకటేశ్ సుమోటోగా స్వీకరించి రీఓపెన్ చేశారు. దీనిపై పొన్నమడి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు కేసు రీఓపెన్ చేయకుండా అడ్డుకోవాలన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను పరిశీలించి జస్టిస్ వెంకటేశ్ లాంటి వారు జడ్జిలుగా ఉండడం గర్వకారణమని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు.