Supreme Court: పాకిస్తాన్‌కి చెందిన ఆర్టిస్టులను భారతదేశంలో ప్రదర్శనలు ఇవ్వడంపై, వారు ఇక్కడ పనిచేయడంపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. పిటిషనర్ ‘‘అంత సంకుచిత మనస్తత్వం’’ కలిగి ఉండవద్దని కోరింది. ఈ పిటిషన్‌ని అత్యున్నత కోర్టు కొట్టేసింది. సినీ వర్కర్, ఆర్టిస్ట్ అని చెప్పుకునే ఫైజ్ అన్వర్ ఖురేషీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిష
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించవద్దని, వారిని ఎన్నికల విధులకు దూరం పెట్టాలంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.
దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే మా పోరాటం కొనసాగుతుంది అని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ వ్యాప్తంగా యువతకు ఉపాధి లేదు.. ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉంది.
Supreme Court: భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన అదానీ గ్రూప్‌ని లక్ష్యం చేసుకుంటూ హిండెన్ బర్గ్ రిపోర్టు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్టు కారణంగా అదానీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వ్యవహారం ఇటు వ్యాపారపరంగానే కాకుండా, రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేశాయి.
Supreme Court: 'ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు నిజమైన అధికారం ఉంటుంది. వారు రాష్ట్రాలు, కేంద్రంలోని ప్రభుత్వాలలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ప్రతినిధులగా ఉంటారు' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
వాయి కాలుష్యంపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో రైతులను విలన్లుగా చిత్రీకరించడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పటిషన్‌పై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంపై పంజాబ్ ప్రభుత్వం రైతులను కారణంగా చూపించింది. బహిరంగంగా పంట వ్యర్థాలను కాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. దీంతో సుప్రీం కోర్టు రైతులకు మద్దతుగా వ్యవహరించింది. Also Read:…
AP CID to Move Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.. ఈ సమయంలో కేసుపై కీలక వ్యాఖ్యలు చేసింది.. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఏపీ సీఐడీ నిర్ణయం తీసుకుంది.. ఏపీ సీఐడీ లీగల్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది.. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిట్ మంజూరు కావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది ఏపీ…
న్యాయ ప్రయోజనాల కోసం వేరే రాష్ట్రంలో కేసు దాఖలు చేసినప్పటికీ, హైకోర్టులు, సెషన్స్ కోర్టులు ముందస్తు అరెస్టు బెయిల్ మంజూరు చేయగలవని, అది అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒక రాష్ట్రంలో నేరం జరిగితే మరో రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌కు సంబంధించిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఈ ప్రకటన చేసింది.