సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి నిన్న (శుక్రవారం) రెండు విస్కీ బాటిళ్లను పెట్టడంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికేట్‌పై నమోదైన కేసులో హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
Pannun murder plot: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడనే అభియోగాలపై నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని అమెరికా ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. ఈ కేసుపై ఇప్పటికే అమెరికా న్యాయశాఖ అభియోగాలు మోపింది. గుప్తాను తమకు అప్పగించాలని అమెరికా చెక్ అధికారులను కోరుతుంది, దీనిపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ సత్యం గెలిచింది. గౌరవ సుప్రీంకోర్టు మరోసారి నిరూపించింది. సత్యమేవ జయతే. మాకు అండగా నిలిచిన వారికి కృతజ్ఞుడిని. భారతదేశ వృద్ధిలో మా సహకారం కొనసాగుతుంది. జైహింద్’’ అని ఎక్స్(ట్విట్టర్)లో ట్వీట్ చేశారు.
Adani Stock : అదానీ గ్రూప్ (అదానీ గ్రూప్ స్టాక్స్) షేర్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో గొప్ప వృద్ధిని కనబరుస్తున్నాయి. సుప్రీం కోర్టు కీలక నిర్ణయానికి ముందు గ్రూప్‌లోని అన్ని షేర్ల ధరలు పెరిగాయి.
Adani-Hindenburg case: గతేడాది అదానీ-హిండెన్‌బర్గ్ కేసు ఎన్నో సంచలనాలకు కారణమైంది. అదానీ గ్రూప్ ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేక ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసును విచారించాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుపై రేపు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్ప వెలువరించనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
రాజకీయ నాయకుల జీవితకాల అనర్హత నిషేదం కేసును ఇవాళ విచారిస్తామని పాకిస్థాన్ సుప్రీంకోర్టు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్), ఎన్నికల చట్టం 2017కి సవరణ ప్రకారం అనర్హత కాలానికి సంబంధించిన అన్ని వివాదాలను చీఫ్ జస్టిస్ ఖాజీ ఇసా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ చేయనుంది.
ఏదైనా కేసులో తీర్పు ఇచ్చే ముందు న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే నిర్ణయం తీసుకుంటారని అందులో వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండబోవని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
Court Cases: దేశంలోని వివిధ కోర్టుల్లో కేసుల సంఖ్య పేరుకుపోతోంది. భారత న్యాయవ్యవస్థలో ఎప్పటికైనా న్యాయం లభిస్తుంది, కానీ దానికి కొంత సమయం పడుతుందని అంతా చెబుతుంటారు. కొన్ని కేసులు దశాబ్ధాలు పాటు కొనసాగుతుంటాయి. తాజాగా కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.