High Tension in Vijayawada: విజయవాడ భవానీపురంలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు బాధితులు.. వారిని స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు.. రోడ్లపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు బాధితులు. ఆందోళన చేస్తున్న వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు.. అయితే, పోలీసులను చుట్టుముట్టి వారితో వాగ్వాదానికి దిగారు బాధితులు. మరోవైపు.. భవానీపురంలో భవనాలు కూల్చివేసిన తర్వాత.. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని ఉత్తర్వులు ఇచ్చింది. Read Also: Top Headlines @ 9 PM: టాప్…
CJI Surya Kant: తప్పిపోయిన ఐదుగురు రోహింగ్యాలను గుర్తించాలని కోరుతూ దాఖలపై పిటిషన్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్రంగా స్పందించారు. అక్రమ వలసదారులకు దేశం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతించాలా.? అని ప్రశ్నించారు. ఎవరైనా అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తే వారిని దేశంలో ఉంచాల్సిన బాధ్యత ఉందా అని ప్రధాన న్యాయమూర్తి అడిగారు. రోహింగ్యాలను చట్టపరమైన ప్రక్రియ ద్వారా బహిష్కరించాలని పిటిషన్ లో కోరారు.
వక్ఫ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. UMEED పోర్టల్‌లో అన్ని వక్ఫ్ ఆస్తులను (‘వక్ఫ్ బై యూజర్’ హోదా ఉన్న వాటితో సహా) నమోదు చేయడానికి ఆరు నెలల గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 ప్రకారం వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడానికి ఆరు నెలల గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. కొత్త చట్టం ప్రకారం అందించిన…
Maulana Mahmood Madani: జమియత్ ఉలేమా-ఎ-హింద్ చీఫ్ మౌలానా మహమూద్ మదాని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్, జ్ఞాన్వాపి-కాశీ వంటి కేసులతో సుప్రీం, హైకోర్టులపై ప్రభుత్వాలు ఒత్తిడిని పెంచుతున్నాయని ఆరోపించారు
వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఈ ఏడాది మే 24న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులు దారుణ హత్యకు గురయ్యారు. ఈకేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతల హత్య కేసులో తమకు సంబంధం లేదని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు…
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్‌లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి.
దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కాలుష్యం కారణంగా నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. రోజురోజుకి గాలి నాణ్యత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
Supreme Court: భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో గోవిందప్ప, ధనజయ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ సందర్భంగా సరెండర్ నుంచి న్యాయస్థానం మినహాయింపు ఇచ్చింది.