నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ఉన్నారు.
Read Also: Ayodhya: హనుమంతుడి జన్మస్థానం నుంచి అయోధ్య చేరుకున్న రథం..
మాజీ సీజేఐ రంజన్ గొగోయ్, మాజీ సీజేఐ ఎస్ఏ బోబ్డే, ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ 2019లో చారిత్రక తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. రంజన్ గొగోయ్ 2019 నవంబర్ 17న సుప్రీంకోర్టు సీజేఐ పదవి నుంచి పదవీ విరమణ చేశారు. నాలుగు నెలల తర్వాత రాష్ట్రపతి ఆయనను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేశారు. కాగా.. అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఏపీ గవర్నర్ గా ఉన్నారు.
Rahul Gandhi: బ్రహ్మపుత్ర నదిలో రాహుల్ గాంధీ పడవ ప్రయాణం.. ఫొటోలు వైరల్