భారతీయ జనతా పార్టీకి బాగా ఆదరణ పెరగటానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలే కారణమని కేంద్ర, ఎరువులు మరియు రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వ్యాఖ్యానించారు.బెజవాడ పర్యటన లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డబ్బు పంపిణీతో ప్రాంతీయ పార్టీల ఓటు చీలిందని కర్ణాటక రాజకీయలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ తగ్గలేదని, కానీ ఇతర పార్టీల ఓటు కాంగ్రెస్…
ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల నోటు రద్దు నిర్ణయం సాహసోపేతమైన నిర్ణయం అంటూ వ్యాఖ్యానించాడు. గత కొంతకాలంగా సమాజంలో రెండు వేల నోటు ఎక్కడా కనిపించడంలేదు.. ఈ డబ్బు దాచేసిన బ్లాక్ మనీదారులు ఈ దెబ్బకు బయటకు రావాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ ఇన్ ఛార్జ్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేథప్యంలో ఇన్ చార్జ్ లను కేటాయించారు. దీంతో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.
ఏపీ బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఏపీ బీజేపీ ప్రఘాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఈ కమిటీలో భాగంగా..
Somu Veerraju: గన్నవరంలో ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి.. ఛార్జ్ షీట్ కార్యక్రమం అమలుపై సమీక్ష జరుగుతోంది.. నేతల పనితీరుపై చర్చ ఉండగా.. పొత్తులపై పవన్ ప్రకటన, సొంత పార్టీ నేతల కామెంట్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.. అయితే, ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఇవాళ పొత్తులపై చర్చ లేదు.. అధిష్టానానికి అన్నీ వివరించామని స్పష్టం చేశారు.. బీజేపీ, టీడీపీ, జనసేన…
వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.
Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు… అకాల వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు లేవని ఆరోపించారు. రైతులను దారుణమైన ఇబ్బందులు పాలు చేశారని మండిపడ్డారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు.. దానిపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక అవకతవకులు జరుగుతున్నాయి, టెక్నాలజీ…