కృష్ణా జలాల పంపిణీ, కొత్త ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా… ఈ వ్యహారంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు… తెలంగాణపై మండిపడ్డారు.. ఏపీకి నీటి కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అవలంభిస్తోందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్టు తెలిపారు.. దీనిపై రేపు కర్నూలు వేదికగా.. రాయలసీమ బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు.. మరోవైపు.. రాష్ట్రంలో జగనన్న ఇళ్లు అర్జెంటుగా కట్టేయాలంటూ లబ్ధిదారను ఇబ్బంది…
రాజమండ్రి : జల వివాదంపై ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జల వివాదం ఏపీ ప్రజల సమస్య అని… ప్రజల పక్షాన రాష్ట్ర బిజెపి పోరాడుతుందన్నారు. ఏపి జలాల విషయంలో అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 4వ తేదీన బిజెపి ముఖ్య నాయకులతో కర్నూల్ లో సమావేశం నిర్వహించి.. ఈ వివాదంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. read also : దర్భంగా పేలుడు కేసులో కీలక…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోన్న సమయంలో.. చర్చలకు సిద్ధమైంది భారతీయ జనతా పార్టీ.. ఎల్లుండి కర్నూలులో రాయలసీమ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాయలసీమ పదాధికారులు, ఎనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. రాయలసీమలో నీటిపారుదల ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. రాయలసీల ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ కుడికాలువ, గుండేగుల, వేదవతి ప్రాజెక్టులపై బీజేపీ నేతలు చర్చించనున్నారు.. ప్రాజెక్టుల అంశంలో భవిష్యత్ కార్యక్రమాన్ని కూడా…
పెట్రో బాంబ్ పేలుతూనే ఉంది.. చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేసింది.. పెట్రో ధరలు పెరిగిపోతున్న సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి వస్తే తప్పకుండా ధరలు తగ్గుతాయన్నారు.. అయితే, పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాని రాష్ట్రాలు ఒప్పుకుంటే ధరలు తగ్గుతాయని చెప్పుకొచ్చారు. పెట్రోల్‌ను దిగుమతి చేసుకోవడానికే కేంద్రం చాలా ఇబ్బంది పడుతోందన్న సోము వీర్రాజు.. అందువల్ల పెట్రోల్‌లో ఇంధనాల్ కలపడం,…