భారతీయ జనతా పార్టీకి బాగా ఆదరణ పెరగటానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ పధకాలే కారణమని కేంద్ర, ఎరువులు మరియు రసాయన శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా వ్యాఖ్యానించారు.బెజవాడ పర్యటన లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ డబ్బు పంపిణీతో ప్రాంతీయ పార్టీల ఓటు చీలిందని కర్ణాటక రాజకీయలపై కూడా ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ తగ్గలేదని, కానీ ఇతర పార్టీల ఓటు కాంగ్రెస్ కి వెళ్లిందని అని అన్నారు. 2024 ఎన్నికలలో కర్నాటక లో మెజారిటీ ఎంపీ స్థానాలు మేము సాధిస్తామని, తమిళనాడు, కేరళలో బిజెపి బలోపేతం అవుతోందని ఆయన అన్నారు.. తెలంగాణలో అధికారం కచ్చితంగా చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని, జనసేన, బిజెపి పొత్తుతో ఏపీలో కలిసి పని చేస్తున్నట్లు కూడా తెలిపారు. ఎవరైనా ఏదైనా చెబితే అది వారి సొంత అభిప్రాయం కింద పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.పురోగతి లేక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికే కట్టుబడి ఉందని కూడా తెలిపారు. పార్టీ విధానంలో మేమంతా కూడా కలిసి పని చేస్తామన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకే కేంద్రం సహకారం అనే వాదనలో వాస్తవం లేదని కూడా కొట్టి పారేశారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే కేంద్రం కోరుకుంటుందని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ కారణాలతో ఆరోపణలు చేస్తున్నారని ఆయన తప్పుబట్టారు. పేదల కోసం కేంద్రం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తుందని,పోలవరం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి మాత్రం సరిగా లేదని వ్యాఖ్యానించారు. చేసిన పనులకు బిల్లులు పూర్తి గా అయితే ఇవ్వలేదన్నారు. మోడీ తొమ్మిదేళ్లలో పూర్తి పారదర్శకమైన పాలన ను అందిస్తున్నారని, మోడీ మంచి పాలన అందిస్తున్నారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. 2024 ఎన్నికలలో దేశ వ్యాప్తంగా మోడీ హవాతో విజయం సాధిస్తామని,దేశ ఆర్ధికాభివృద్ధి ఎంతో పెరిగిందని కూడా చెప్పారు