Somu Veerraju: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ సొంత పథకాలుగా వైసీపీ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, గృహానిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్రం నిధులను వైసీపీ కార్యకర్తలు పక్కదారి పట్టించడం తప్ప, రాష్ట్ర అభివృద్ధిలో వారికి సంబంధం లేదు అని సోము వీర్రాజు అన్నారు.
Also Read : Minister Kakani : వాళ్లు ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పుతున్నారు..
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దెబ్బతీసిన సీఎం జగన్ పై ప్రజా ఛార్జ్ షీట్ వేస్తున్నాము అంటూ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉత్తరాంధ్రలో పెండింగ్ లో ఉన్న ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తిచేయలేని ప్రభుత్వమిది అని ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే సీఎం జగన్ మాత్రం తన ఫోటోలు వేసుకుంటున్నాడు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం వైసీపీ సర్కార్ ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టలేని పరిస్థితి వచ్చిందని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని కేంద్రానికి వివరించానని సోము వీర్రాజు తెలిపారు. వారి నిర్ణయం తర్వాత బీజేపీ స్ట్రాటజీని ఫాలో అవుతామని ఏపీ బీజేపీ చీఫ్ అన్నారు.
Also Read : Delhi: భార్యా పిల్లలను కడతేర్చిన కసాయి.. చివరకు ఇంటర్నెట్‌లో చదివి భర్త ఆత్మహత్య..