బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు తెలిపారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.
దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్ఛ కోసం అతి చిన్న వయస్సులోనే ప్రాణాలర్పించిన గొప్ప పోరాట స్ఫూర్తి ప్రధాత అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురష్కరించుకుని రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సభలో సోము వీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద చిత్రపటాలకి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డితో కలిసి వీర్రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. Also Read: Pawan…
పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..! వైఎస్‌ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా..…
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీపైన ఆయన విరుచుకుపడ్డారు. కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయడం.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు రాకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 150మందికి పైగా బీజెపీలో చేరారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. 60 అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్ళలేదు.. ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే.. ప్రతిపక్ష…
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు నా హామీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి బటన్ నొక్కి అన్ని హామీలు అమలు చేసినా.. మిమ్మల్ని ఎందుకు ప్రజలు ఓడించారో తెలపాలి అంటూ వైఎస్ జగన్‌ను నిలదీశారు..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు.
తిరుమలలో స్వచ్ఛమైన లడ్డు తయారు చేసి భక్తులకు అందించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు.. ఇందుకు నేను స్పష్టంగా హామీ ఇస్తున్నానని అన్నారు. తిరుమల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధోరణి హేయమైందని మండిపడ్డారు.