మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు.. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు అంచనాలు వేయడం కష్టం అన్నారు.. విశాఖపట్నం రాజధాని పేరు చెప్పి 500 కోట్ల రూపాయలతో బిల్డింగ్ కట్టుకున్నాడు.. తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారన్న ప్రతిపాదన గాని ఆలోచన గాని లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరినట్లు తెలిసింది.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభమైంది.. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు సిద్ధార్థ నాథ్ సింగ్, అరుణ్ సింగ్ హాజరయ్యారు. ఇక, తాజాగా బీజేపీ సీటు దక్కించుకున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.. అయితే, బీజీపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం చర్చగా మారింది.. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, సీనియర్ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ కూడా ఈ కీలక…
వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు సోము వీర్రాజు
తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఇక పూర్తి కాదనే స్థితికి తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలవరం నిర్మాణం చేస్తున్నవారే నష్టం జరిగిందని...
రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు వీర్రాజు.. ఇటువంటి ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడిందన్న ఆయన.. నా మీద ఫిర్యాదులు ఎవరు చేశారో, పార్టీలో నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదని పేర్కొన్నారు.