AP BJP: ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం.. క్లాస్ పీకిన ప్రధాన కార్యదర్శి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP State Executive Meeting Details: ఏపీ బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఏపీ బీజేపీ ప్రఘాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఈ కమిటీలో భాగంగా.. తొమ్మిదేళ్ల మోడీ పాలనపై ప్రచారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పొత్తులపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆ ప్రస్తావన లేకుండానే ఈ సమావేశం ముగిసింది. అయితే.. ఈ కార్యవర్గంలో జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ పార్టీ నేతలకు క్లాస్ పీకారు. ఏపీలో బీజేపీ బలపడడానికి అవకాశం ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో బలపడలేదని మండిపడ్డారు. ప్రతి అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఐదారుగురు పోటీ పడే పరిస్థితి ఉండాలన్నారు. నేతలు, కార్యకర్తలు క్రమశిక్షణ మెలగాలని.. ఎంతవరకు మాట్లాడాలో అంత వరకే మాట్లాడాలని సూచించారు.
MP Uttam Kumar Reddy : ఈసారి 50వేల ఓట్లకు ఒక్కటి తక్కువచ్చినా.. రాజకీయాలకు గుడ్ బై చెప్తా..
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
పార్టీ విషయాలపై ఏమైనా మాట్లాడాలంటే.. పార్టీ పెద్దలకు నేరుగా చెప్పాలని శివ ప్రకాష్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరింత బలం పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటకలో ఓడిపోయినంత మాత్రాన అక్కడ బలం తగ్గినట్టు కాదని.. గత ఎన్నికల్లో ఎంత ఓట్ల శాతం వచ్చాయో, ఇప్పుడు కూడా అంతే శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. జేడీఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గడం వల్లే కర్ణాటకలో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునేలా పని చేయాలని.. ప్రతి నియోజకవర్గంలో ఫుల్‌టైం విస్తారక్‌లుగా పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఫుల్ టైం విస్తారక్‌లకు మరింత ట్రైనింగ్ ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనే 26 జిల్లాల ఇన్‌చార్జీలను మార్చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 26 జిల్లాల కొత్త ఇన్‌చార్జీలను ప్రకటించారు.
2000 Notes Withdraw : ఆ సెక్షన్ ఉపయోగించి రూ. 2000 నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!