Somu Veerraju On TDP YCP Parties Over AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది బీజేపీ లక్ష్యమని.. రాజధానిని కట్టడంలో టీడీపీ, వైసీపీ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతి రాజధాని కనెక్టివిటీ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైలు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. పొత్తులపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని సూచించారు. కేంద్రం ఇస్తున్న నిధుల్ని తప్పిస్తే.. రాష్ట్ర ఖజానా నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఖర్చు చేసిందా? అని ప్రశ్నించారు. బీసీలను నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. పేరుకు బీసీ కార్పొరేషన్ పెట్టారు గానీ.. అందులో నిధులు ఏమీ లేవన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తాము బీసీ చైతన్య సభలు నిర్మించబోతున్నామని అన్నారు. అవినాష్ రెడ్డిని సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేస్తుందని.. సిబిఐ వాళ్లు తిరుగుతున్నారని.. అది మీరు గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.
Peddireddy Ramachandra Reddy: కక్షపూరితంగానే ఆ పని చేశారంటూ.. చంద్రబాబుపై మంత్రి ఫైర్
అంతకుముందు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పరిపాలన పూర్తైన సందర్భంగా తాము 13 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సోము వీర్రాజు తెలిపారు. మే 30వ తేదీ నుంచి జూన్ 30 వరకు అందరి ఇళ్ళకు వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేశామని.. డోర్ టూ డోర్ వెళ్లి మోడీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ చార్జిషీటు దాఖలు చేసిన సమయంలో అనేక అంశాలు మా దృష్టికి వచ్చాయన్నారు. ఏపీలో ప్రభుత్వం ఉందా? సీఎం పరిపాలిస్తున్నాడా లేక నాయకులే పాలిస్తున్నారా? అనే విషయం అర్థం కావడం లేదన్నారు. ఏపీని పరిపాలిస్తుంది, అభివృద్ధి చేస్తుంది మోడీ మాత్రమేనని పేర్కొన్నారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయించారని.. పోర్టులు, విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ది చేస్తున్నారని వెల్లడించారు.
Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య