Somu Veerraju: ధాన్యం కొనుగోళ్లల్లో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు… అకాల వర్షాల వలన కలిగిన నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వానికి అంచనాలు లేవని ఆరోపించారు. రైతులను దారుణమైన ఇబ్బందులు పాలు చేశారని మండిపడ్డారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు.. దానిపై పోరాటం చేస్తామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక అవకతవకులు జరుగుతున్నాయి, టెక్నాలజీ వచ్చింది.. కానీ, మార్చి, ఏప్రిల్, మే నెలలోనెలలో జరిగే విపత్తుల గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు.. ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
Read Also: RCB vs DC : ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. మరో రికార్డ్ పై కన్నేసిన విరాట్ కోహ్లీ
రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. రైతును ఈ ప్రభుత్వం రోడ్డున నిలబెట్టిందని విమర్శించారు సోము వీర్రాజు. మిల్లరు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కయ్యారు.. ధర నిర్ణయించి ఆర్బికేలో అప్డేట్ చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి 3500 కోట్లు అక్రమాలు సివిల్ సప్లైస్, మిల్లర్లు చేస్తుంటే ప్రభుత్వాలు నిద్రపోతున్నాయి. ఈ కుంభకోణం ఎప్పటినుంచో జరుగుతుందని అన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించామని అన్నారు. ప్రతి సోమవారం కరెక్టేట్ వద్ద ధర్నాలు, జిల్లా స్థాయిలో జరుగుతున్న అవినీతిపై చార్జిషీట్ రూపొందిస్తాం.. జిల్లా ఎస్పీకే అందజేస్తామని వివరించారు. నాలుగు రకాలుగా ఆందోళన చేస్తామని అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఏ సహాయం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల్లా మరిపోతున్నారని ఆరోపించారు సోము వీర్రాజు.