Kiran Kumar Reddy Interesting Comments On Politics: ఇటీవలే బీజేపీలో చేరిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం ఎక్కడ పనిచేయమంటే, తాను అక్కడే పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకున్న రాజకీయ అనుభవంతో.. బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి మధుకర్‌లతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన తర్వాత తాను నెల రోజుల పాటు అమెరికాకు వెళ్లానని చెప్పారు. ప్రస్తుతమున్న పరిస్థితి ఏంటి? పార్టీని బలోపేతం చేసేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై తాము చర్చించామని అన్నారు. అలాగే.. సమయం, సందర్భం వచ్చినప్పుడు తాను ఏపీ రాజకీయాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అవుతానని స్పష్టం చేశారు.
Nellore Crime: నెల్లూరులో విషాదం.. పిల్లల్ని రక్షించబోయి తల్లులు మృతి
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీని బలోపేతం చేయడం విషయంపై కిరణ్‌కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయనకు వివరించామని.. కిరణ్‌కుమార్ నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని అన్నారు. కిరణ్‌కుమార్ వద్ద పార్టీ బలోపేతానికి సంబంధించి మంచి కార్యాచరణ ఉందని, ఆయన మార్గనిర్దేశనంలో పనిచేస్తామని వివరించారు. కాగా.. కిరణ్‌కుమార్ రెడ్డితో ఏపీ బీజేపీ నేతలు ఆయన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశం అయ్యారు.
Bandi Sanjay: మోడీ 9 ఏళ్ల పాలనపై జన సంపర్క్ అభియాన్ ప్రారంభం