Somu Veerraju: అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.. అప్పులను ఆదాయంగా చూపించ కూడదని ఆర్బీఐ చేసిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా అసెంభ్లీసాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారు. ఆయన అందుకు విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తనవాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను శాసన సభలో వెల్లడించారని తప్పుపట్టారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా…
Somu Veerraju: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సాంప్రదాయ వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు? అని లేఖలో ప్రశ్నించిన ఆయన.. ఈ విషయం ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేదికగానైనా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని అందించిన భారత ఖండం ఖ్యాతిని తెలుసుకోండి.. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు…
Somu Veerraju: కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. అప్పటికే ఆయన బీజేపీ అగ్రనాయకత్వంలో మాట్లాడారని.. జాతీయ స్థాయిలో ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని.. అన్ని సెట్ అవుతే.. త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.. అయితే, చిత్తూరులో మీడియాతో మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. కిరణ్ కుమార్ రెడ్డి ఇష్యూపై స్పందించారు.. కిరణ్ కుమార్…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదు? అని…
Somu Veerraju: 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జనసేన పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం అన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు తగ్గాయన్నారు. మోడీ అంటేనే అభివృద్ధి,…