చీర కోసం ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లోని ఓ బిల్డింగ్ 9వ అంతస్తులో ఉండే ఓ మహిళ తన చీరను బాల్కానీలో ఆరేసింది. అయితే, ఆ చీర గాలికి ఎగిరి ఎనిమిదో అంతస్తులో పడింది. కింది అంతస్తులో చీర పడిపోవడాన్ని గమనించిన సదరు మహిళ తన కుమారుడిని 9 అంతస్తు బాల్కాని నుంచి ఎనిమిదో అంతస్తులోకి దించింది. దీనికోసం ఆమె దుప్పటిని తాడులా ఉపయోగించింది. కింది అంతస్తులోకి దిగిన ఆ…
భూమిమీత అతిపెద్ద జీవులుగా గుర్తించబడిన రాక్షసబల్లులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయాయి. అయితే, వాటికి సంబంధించిన ఆనవాళ్లు, వాటి శిలాజాలు, గుడ్లు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో రాక్షసబల్లుల గుడ్లు కొన్ని బయటపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని బడవాన్ అడవిలో 10 గుడ్లు బయటపడ్డాయి. ఈ గుడ్ల వయస్సు సుమారు కోటి సంవత్సరాలకు పైగా ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురాతత్వ శాస్త్రవేత్తలు పురాతన శిల్పాలు, కోటలు తదితర వాటిపై సర్వేలు నిర్వహిస్తున్న సమయంలో సెంధ్వా జిల్లాలోని హింగ్వా…
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ సేవలు ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల వరకు ట్విట్టర్లో ట్వీట్లు చేయడానికి యూజర్లు నానా అవస్థలు పడ్డారు. మొబైల్ మాత్రమే కాదు వెబ్సైట్లోనూ ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ మొరాయించింది. లోడింగ్ సమస్యతోపాటు పోస్టింగ్‌లు చేయలేకపోయామని, లాగిన్ కూడా కాలేకపోయామని యూజర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను ఉపయోగిస్తుండగానే మధ్యలోనే లాగౌట్ అయిందని పలువురు వాపోయారు. ట్విట్టర్…
కరోనా కాలంలో మాస్క్ ఎంతగా ఉపయోగపడుతుంతో చెప్పాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించడం వలనే కోట్లాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ లేకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీకాదు. ఇరాన్ కు చెందిన కార్టూనిస్ట్ ఆయత్ నదేరీ ఇస్ఫాహన్ యూనివర్శిటీలో ఆర్ట్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. టీచింగ్ వృత్తితో పాటు ఆయన సృజనాత్మకంగా గీసే కార్టూన్స్ ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. క్యారికేచర్ గ్రామ్, తాష్ ఆర్ట్స్ వంటి అకాడమీలను ఏర్పాటు చేసి నిత్యం కార్టున్లపై శిక్షణ…
కొన్ని అకేషన్స్ సమయంలో పూలకి మహాగిరాకి ఉంటుంది. పండుగల సమయంలోనూ, వేడుకల సమయంలోనూ, పెళ్లిళ్ల సీజన్లోనూ పూలకు యమా గిరాకీ ఉంటుంది. పెళ్లిళ్లలో పూలతో అలంకరించడం కంటే బంగారం కొనుగోలు చేయడం మంచిదని అనుకునేంతగా ధరలు ఉంటాయి. పూలు లేకుండా పెళ్లిళ్లు జరగడం కష్టం. పెళ్లిళ్ల సమయంలో చాలా మంది పెళ్లి మండపాలనే కాకుండా కార్లను కూడా పూలతో అలంకరిస్తుంటారు. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన వివాహం సమయంలో వినూత్నంగా అలోచించాడు. పూలతో కారును…
ఇంటిని నిర్మించుకోవాలి అంటే కనీసం రెండు నుంచి నాలుగు సెంట్ల స్థలం అవసరం అవుతుంది. నాలుగు సెంట్ల స్థలంలో ఓ మాదిరి ఇంటిని నిర్మించుకోవచ్చు. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం. కానీ, బీహార్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన సంతోష్ అనే తనకున్న ఆరు అడుగుల స్థలంలో ఎలాగైనా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఆరు అడుగుల వెడల్పు, 45 అడుగుల పొడవున్న స్థలంలో మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడు. తనకు తెలిసిన తాపీ మేస్త్రీని…
కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అలవాటుపడిపోయారు. ఉద్యోగాలతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. ఇంటివద్ద నుంచి పనిచేసే సమయంలో కొన్ని సందర్భాల్లో ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్ లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం మార్టినెజ్ అనే యువతి ఆన్లైన్ ద్వారా అప్లై చేసింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆన్లైన్ ద్వారానే జరిగింది. ఇంటర్వ్యూలో ఆమెను స్కైవెస్ట్ కల్చర్ గురించి మీ…
ఈ ప్రపంచంలో ఒక్క మనిషి మాత్రమే కాదు… ప్రతి ప్రాణి జివించాలి. అన్ని ప్రాణులు జీవించగలిగితేనే ప్రపంచ గమనం ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే, ఢిల్లీకి చెందిన రాకేష్ ఖత్రి అనే వ్యక్తి పక్షుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఢిల్లీలో పక్షుల కోసం ఆయన ఇప్పటి వరకు 2.5 లక్షల గూళ్లను తయారు చేశాడు. వాటిల్లో వేల పక్షలు ఆవాసం ఉంటున్నాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో రాకేష్ ఖత్రి అంటే తెలియని…
కర్ణాటకలో హిజాబ్ వివాదంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ స్పందించారు. కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు అలజడి రేపేలా ఉన్నాయని కమల్ ట్వీట్ చేశారు. అమాయక విద్యార్థుల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో జరుగుతున్న ఇటువంటి పరిణామాలు తమిళనాడు వరకు పాకకుండా చూసుకోవాలని… తమిళనాడులో ప్రగతిని కోరుకునే వారు ఇటువంటి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ తన…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్యాషన్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతున్నది. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు పాపులర్ అవుతున్నారు. గతంలో కండోమ్స్‌తో డ్రెస్సులతో కొందరు పాపులర్ కాగా, ఖాళీ కేఎఫ్‌సీ బకెట్ లతో చేసిన డ్రెస్ వేసుకొని ట్రెండింగ్‌లో నిలిచారు. ఇప్పుడు చిప్స్ ప్యాకిట్స్తో శారీని ధరించి ఓ యువతి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఖాళీ చిప్స్ ప్యాకెట్లను కట్ చేసి వాటితో శారీని తయారు…