హెలికాఫ్టర్లో తిరగాలని ఎవరికైనా ఉంటుంది. రైళ్లు, బస్సులలో తిరగడం అంటే కామన్ అయింది. అయితే, విమానాలు, హెలికాఫ్టర్లో తిరగాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో వధూవరులను హెలికాఫ్టర్లో తీసుకురావాలని అనుకుంటారు. అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కనీసం అలా వెళ్లాలి అనుకునే వారికోసం ఎదైనా చేయాలని అనుకున్నాడు బీహార్‌కు చెందిన మెకానిక్, ఆర్టిస్ట్ అయిన గుండు శర్మ. తన వద్ద ఉన్న నానో కారుకు హెలికాఫ్టర్‌గా మార్చేయ్యాలని అనుకున్నాడు.
Read: Storm Eunice: ఈదురు గాలుల్లో విగ్గుకోసం పరుగులు…
వెంటనే ప్లాన్‌ను అమలు చేశాడు. రెండు లక్షల రూపాయలతో నానో కారును హెలికాఫ్టర్‌గా మార్చేశాడు. అచ్చంగా హెలికాఫ్టర్ ఎలా ఉంటుందో అలానే దించేశారు. కాకపోతే, ఈ నానో హెలికాఫ్టర్ నేలపై మాత్రమే నడుస్తుంది. కానీ, ఫీలింగ్ మాత్రం హెలికాఫ్టర్‌లో వెళ్లినట్టు ఉంటుందని చెబుతున్నాడు. దీనిని ఒకరోజు బాడుగకు బుక్ చేసుకోవాలంటే రూ. 15 వేలు ఖర్చు అవుతుందట. అయితేనేం, లక్షలు పెట్టేబదులు సింపుల్‌గా రూ. 15 వేలు పెడితే సరి అని బుక్ చేసుకుంటున్నారు వధూవరులు.