జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్‌ఎస్ కండువాలు కప్పి పోస్ట్ చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్-సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
జగ్గారెడ్డి కి బుజ్జగింపులు పర్వం మొదలైంది. పార్టీలో తనని కోవర్ట్ అంటున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని పార్టీనుంచి వెళ్లకుండా బుజ్జగిస్తున్నారు వీహెచ్. జగ్గారెడ్డి కి ఉత్తమ్, భట్టి , ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, శ్రీనివాసన్ ఫోన్ చేశారు. సోనియా గాంధీ దగ్గరకి వెళ్దాం అని సూచించారు వీహెచ్. పాత కాంగ్రెస్ నేతలను బయటకు పంపే కుట్ర జరుగుతోందని కామెంట్ చేశారు వీహెచ్.
కాసేపట్లో సోనియా గాంధీకి లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ అందర్నీ కలుపుకుని పోవాలని హనుమంతరావు సూచించారు. సీనియర్ నాయకుడిగా తన బాధ్యతలు నిర్వహిస్తానన్నారు. అందరితో సంప్రదింపులు జరిపితే బాగుంటుందని సూచిస్తున్నా అన్నారు. పార్టీలో ఒకరినొకరు పొడుచుకుంటే ఎలా అని ప్రశ్నించారు. తనకు కూడా అవమానం జరిగితే.. సర్దుకపోయానన్నారు. వెంకట్ రెడ్డి దగ్గరకు రేవంత్ ఎందుకు వెళ్లారో తనకు తెలియదని.. అలాగే జగ్గారెడ్డి దగ్గరకు కూడా వెళ్లాలని వెల్లడించారు. అందర్నీ కలుపుకునిపోయే వ్యక్తి లీడర్ అవుతాడన్నారు వీహెచ్. ఈ బుజ్జగింపులు పని చేస్తాయా ? జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.