టూవీలర్ వాహనం కొనేందుకు డబ్బులను నోట్ల రూపంలో తీసుకెళ్తాం లేదంటే, కార్డ్ ద్వారా పే చేస్తాం. కానీ, ఓ వ్యక్తి స్కూటర్ కొనేందుకు పూర్తిగా చిల్లర డబ్బులను సంచుల్లో నింపుకొని వెళ్లాడు. కావాల్సిన స్కూటీని ఎంచుకొని చిల్లర డబ్బుల సంచులను వారిముందు గుమ్మరించాడు. ఆ చిల్లర డబ్బులను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ చిల్లర డబ్బులు లెక్కవేసే సరికి వారి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది.
Read: Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని అలా అరగంట నిలబెట్టాడు…
అంత చిల్లర డబ్బులు ఎప్పుడూ లెక్క వేయలేదని, అంత చిల్లరను లెక్కవేసే సరికి తలప్రాణం తోకకు వచ్చినంత పనైందని సిబ్బంది పేర్కొన్నారు. అస్సాంలోని బారాపేటలో ఈ సంఘటన జరిగింది. దాదాపు మూడు సంచుల్లో తీసుకొచ్చిన చిల్లర డబ్బులు లెక్కవేసిన తరువాత అంతా సరిపోయిందని నిర్ణయించి స్కూటర్‌ను అప్పగించారు. ఇలాంటి వ్యక్తులు ఇద్దరు ముగ్గురు తగిలితే చాలని, నడ్డి విరిగిపోతుందని సిబ్బంది పేర్కొన్నారు.