టూవీలర్ వాహనం కొనేందుకు డబ్బులను నోట్ల రూపంలో తీసుకెళ్తాం లేదంటే, కార్డ్ ద్వారా పే చేస్తాం. కానీ, ఓ వ్యక్తి స్కూటర్ కొనేందుకు పూర్తిగా చిల్లర డబ్బులను సంచుల్లో నింపుకొని వెళ్లాడు. కావాల్సిన స్కూటీని ఎంచుకొని చిల్లర డబ్బుల సంచులను వారిముందు గుమ్మరించాడు. ఆ చిల్లర డబ్బులను చూసి సిబ్బంది షాక్ అయ్యారు. ఆ చిల్లర డబ్బులు లెక్కవేసే సరికి వారి తలప్రాణం తోకకు వచ్చినంత పనైంది. Read: Kim Jong Un: గడ్డగట్టే చలిలో వారిని…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి పోస్ట్ చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్-సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జగ్గారెడ్డి కి బుజ్జగింపులు పర్వం మొదలైంది. పార్టీలో తనని కోవర్ట్ అంటున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో వివిధ రకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఆయన త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్లో చేరతానే ప్రచారం ఊపందుకుంది. పార్టీ అధిష్టానం తీరుపై ఆయన అసహనం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. తనను కోవర్ట్ అంటూ రేవంత్ రెడ్డి అనుచరులే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడవద్దని జగ్గారెడ్డి భావించారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా…
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం బోర్డర్ లో పహారా కాస్తుంటారు సైనికులు. మంచు పర్వతాల్లో ప్రాణాలకు తెగించి పహారా చేయడం అంటే మామూలు విషయం కాదు. పైనుంచి దట్టంగా కురిసే మంచుతో ఆ ప్రాంతాలన్ని కప్పబడి ఉంటాయి. మంచులో నడుస్తుంటే కాళ్లు మోకాళ్ల లోతులో కూరుకుపోతుంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయినా సరే దేశంకోసం జవాన్లు కాపలా కాస్తుంటారు. శతృవుల నుంచి దేశాన్ని రక్షిస్తుంటారు. అత్యంత కఠోరమైన వాతావరణంలో సైతం విధులు నిర్వహిస్తూ…
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు… సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే.. ఎదైనా పిచ్చి పోస్టులు పెడితే సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించిన ఆయన.. ఇంకో సారి పోస్టు పెడితే నీ సంగతి చెబుతా నంటూ సీరియస్‌గా హెచ్చరించారు.. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన స్వామి అనే వ్యక్తికి ఫోన్ చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య..…
తెలంగాణలో మేడారం జాతర ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా ఈ జాతర కోసం ప్రజలు లక్షలాదిగా తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ కారణంగా ప్రైవేట్ వాహనాల యజమానులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో టీఎస్ఆర్టీసీ రంగంలోకి దిగింది. ప్రజలు ఆర్టీసీ బస్సులనే ఎక్కాలంటూ వినూత్నంగా ప్రమోషన్లు చేస్తోంది. గతంలో ఎన్నో కొత్త సినిమాలను ఆర్టీసీ బస్సుల ప్రమోషన్ల కోసం వాడుకున్న టీఎస్ఆర్టీసీ తాజాగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటను వాడేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..…
అత్యవసర సమయాల్లో సహాయం కోసం ప్రతీ రాష్ట్రం ఒక్కో నెంబర్‌ను అందుబాటులో ఉంచుతుంది. ఆ నెంబర్‌కు డయల్ చేస్తే పోలీసులు స్పందించి సహాయం చేస్తారు. అయితే, కొంతమంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. సరదాగా కాల్ చేసి ఆటపట్టిస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఇటీవలే హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానా ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 112ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ హెల్ప్‌లైన్ నెంబర్‌కు ఓ తాగుబోతు కాల్ చేశాడు. కాల్ చేసి సహాయం కావాలని…
రోడ్ సేప్టీ విధానాలు పాటించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాహనాలను అతివేగంగా నడపడం, అజాగ్రత్తగా నడపడం, రైల్వే క్రాసింగ్ వద్ద సిగ్నల్స్ ఉన్నా పట్టించుకోకుండా వాహనాలను నడిపితే ఎంత ప్రమాదమో ఈ చిన్న వీడియో చూస్తే అర్థం అవుతుంది. ముంబైలో ఓ రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వస్తున్నట్టు సిగ్నల్ పడటంతో గేట్మెన్ గేటును క్లోజ్ చేశాడు. కానీ, ఓ వాహనదారుడు దానిని పట్టించుకోకుండా రైలు వచ్చేలోగా క్రాస్ చేసి వెళ్లొచ్చని అనుకున్నాడు. రూల్స్‌ని బ్రేక్…
పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టినపుడు రిజర్వాయర్ కింద ప్రాంతాలు ముంపుకు గురవుతుంటాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాల్లోని ప్రజలను అక్కడి సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నష్టపరిహారం ఇస్తుంటారు. ఏ దేశంలో తీసుకున్నా రిజర్వాయర్ నిర్మాణం జరిగే సమయంలో గ్రామాల్లోని ప్రజలను తరలిస్తుంటారు. స్పెయిన్‌లో 1990 దశకంలో ఆల్టో లిండోసో అనే రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం అసెరెడో గ్రామంలోని ప్రజలను తరలించారు. 1992లో తరలింపు పూర్తయింది. రిజర్వాయర్ లోకి నీటిని మళ్లించడంతో అసెరెడో గ్రామం పూర్తిగా…
పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో…