అగ్ని పర్వతాలు రెండు రకాలు ఉంటాయి. కొన్ని నాన్ యాక్టీవ్‌గా ఉంటే కొన్ని యాక్టీవ్‌గా ఉంటాయి. యాక్టీవ్‌గా ఉండే అగ్నిపర్వతాలు నిత్యం వేడిని వెదజల్లుతుంటాయి. అవి ఎప్పుడు బద్దలవుతాయో చెప్పలేం. ఆ పర్వతాల వద్దకు వెళ్లాలి అంటే ధైర్యం ఉండాలి. అలాంటిది ఆ పర్వతంపై రెస్టారెంట్ ఓపెన్ చేసి, అగ్నిపర్వతం నుంచి వెలువడే వేడితోనే వంట చేస్తే ఇంకెలా ఉంటుంది. కష్టమర్ల సంగతి పక్కనపెడితే అందులో పనిచేసేవారికి గుండెధైర్యం మెండుగా ఉండాలి. ఇలాంటి రెస్టారెంట్ ఒకటి స్పెయిన్‌లోని…
దేశంలో క్రికెట్ కు ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ గేమ్ ఇంగ్లాండ్‌లో పుట్టినప్పటికీ ఉపఖండంలోనే ఫేమస్ అయింది. ఆరేళ్ల చిన్నారి నుంచి 60 ఏళ్ల పెద్దవాళ్ల వరకు క్రికెట్‌ను అమతంగా ఇష్టపడుతుంటారు. పెద్దవాళ్లు సైతం అప్పుడప్పుడు బ్యాట్ చేతపట్టి వావ్ అనిపిస్తుంటారు. ఇలానే ఓ పెద్దాయన బ్యాట్ పట్టుకొని కుర్రాళ్లకు ఏ మాత్రం తీసిపోమని చెబుతూ క్రికెట్ అడాడు. పరుగులు తీశాడు. బ్యాట్ పట్టింది మొదలు ఆ పెద్దాయన తన వయసును మర్చిపోయి…
మ్యాజిక్ ను ఎవరు చేసినా అవాక్కవుతాం. కళ్లకు కనికట్టు చేయడమే మ్యాజిక్. మాములు మనుషులతో ఆటు జంతువులు కూడా అప్పుడప్పుడు మ్యాజిక్‌ను చూసి షాక్ అవుతుంటాయి. జూకు వెల్లిన ఓ యువతి కోతి ముందు ఓ అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్‌ను చూసి షాకైన ఆ కోతి విచిత్రంగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన వీడియోను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఈ సంఘటన మెక్సికోలోని జూలో జరిగింది. ఈ జూకు…
సెల్లార్లోనో లేదంటే పార్కింగ్ ప్రదేశంలోనో కారును పార్కింగ్ చేసిన తరువాత లాక్ పడిందా లేదా అని ఒకటికి రెండుసార్లు చూసుకుంటాం. లాక్ పడింది అని రూఢీ చేసుకున్నాకే అక్కడి నుంచి తిరిగి వెళ్తాం. కానీ, ఆ నగరంలో అలా కాదు. కార్లను ఎట్టిపరిస్థితుల్లో కూడా లాక్ చేయరు. 24 గంటలు అన్‌లాక్ చేసే ఉంచుతారు. అలా ఉంచడం వలన కార్లు దోపిడీకి గురయ్యే అవకాశం ఉంటుంది కదా అనుకుంటే పొరపాటే. కార్లను అన్‌లాక్ చేసి ఉంచినా అక్కడ…
కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ దారి లేనప్పుడు రోడ్డుపై చేయిచాచి భిక్షాటన చేసి దాతలు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ మహిళ భిక్షాటన చేస్తూ భారీగా సంపాదిస్తోంది. అంతేకాదు, రోజుకు ఎంత సంపాదిస్తున్నది అనే విషయాలను ఆమె తన డైరీలో రాసుకుంటున్నది. రోజుకు 1500 వరకు సంపాగిస్తున్నట్టు డైరీలో రాసుకున్నది. అంటే నెలకు సుమారు 40 వేలకు పైగా సంపాదన. క్రమం తప్పకుండా ఆ మహిళ రోజూ రోడ్డుపై చిన్నపిల్లవాడిని ఒడిలో కూర్చుబెట్టుకొని భిక్షాటన చేస్తున్నది.…
సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి. సముద్రంలో చేపలు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఉంటాయనే సంగతి తెలుసు. అయితే, మనకు తెలియని చాలా జలచర జీవాలు సముద్రంలో నివశిస్తుంటాయి. చాలా తక్కువగా మాత్రమే అలాంటి జీవులు బయటకు వస్తుంటాయి. సముద్రంలో షికారుకు వెళ్లిన ఓ వ్యక్తిని విచిత్రమైన జంతువు వెంబడించింది. దానిని చూసిన ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. వెంటనే బోటు వేగాన్ని పెంచాడు. బోటు వేగంతో పాటు ఆ విచిత్రమైన జంతువు కూడా వేగంగా ఆ బోటు…
దేశంలో కరోనా కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉపాధికోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వచ్చిన సంపాదనతో కాలం వెల్లదీస్తున్నారు. తక్కవ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో టిఫెన్ షాపు కూడా ఒకటి. రుచిని బట్టి, ధరలను బట్టి వ్యాపారం సాగుతుంది. కొంతమంది తక్కువ ధరకు మంచి రుచిగా ఉండే టిఫెన్ అందిస్తుంటారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ మహిళ గత 30 ఏళ్లుగా చిన్న టిఫెన్ షాపును నిర్వహిస్తోంది. 30 ఏళ్లక్రితం ఏ ధరలకు టిఫెన్‌ను అందిస్తున్నారో,…
బాలీవుడ్ పొడుగుకాళ్ళ సుందరి శిల్పాశెట్టి సహజంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిందంటే… యోగాకు సంబంధించినవో, హెల్దీ ఫుడ్ కు సంబంధించినవో అనుకుంటాం. అయితే తాజాగా అందుకు భిన్నమైన వీడియోను శిల్పాశెట్టి పోస్ట్ చేసింది. తన పెరటిలోని చెట్టు కాయాలను ఎగిరెగిరి కోసిన వీడియోను పెట్టింది శిల్పాశెట్టి. అంతేకాదు… ఆ వీడియోతో పాటు ఆసక్తికరమైన విషయాలూ పొందుపర్చింది. మన చేతులతో నాటిన మొక్క… చెట్టుగా ఎదగడం, కాయలు కాయడం… వాటిని కోసుకునే ఛాన్స్ మనకు దక్కడం నిజంగా ఆనందకరమైన…