అందరూ అన్ని పనులు చేయలేదు. మనుషులు నీటిలో ఈదగలరేమోగాని చేపలంతటి వేగంగా ఈదలేరు. పక్షుల్లా గాలిలో ఎగరలేరు. మనుషులు కావోచ్చు, జంతువులు కావొచ్చు. వాటికి ఎక్కడైతే వీలుగా ఉంటుందో, వాటి శరీరం ఎలా ఉపయోగపడుతుందో దానికి అనుగుణంగా అవి ప్రవర్తిస్తుంటాయి. నీటిలో బలమైన జంతువుల్లో ఒకటి మొసలి. నీటిలో ఉన్నప్పుడు మొసలిని ఎదిరించడం చాలా కష్టం. ఎంతపెద్ద జంతువైనా సరే దొరికితే చంపి తినేస్తుంది.
Read: Viral: పైథాన్ వర్సెస్ చిరుత… విజయం ఎవరిదంటే…
భారీ ఆకారం కలిగి ఉంటాయి. నీటిలో ఉన్నప్పుడు ఇవి ఎంత బలంగా ఉండాయో, నేలమీదకు వచ్చినపుడు అంతటి బలహీనంగా కనిపిస్తాయి. అయితే, ఈ భారీ ఆకారం కలిగిన మొసళ్లు నీటి నుంచి పైకి చేపల్లా పైకి ఎగరడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెబుతాం. ఎందుకంటే, భారీ ఆకారంతో ఉండే మొసళ్లు ఎగరడం చాలా కష్టం. కానీ, ఓ మొసలి మాత్రం తన ఆకారం సహకరించకపోయినా, ఆహారం కోసం ఫీట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.