దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు చుక్కలను తాకడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇక సామాన్యుల వాహనంగా పేరుగాంచిన సైకిల్ ను దేశంలోని సుమారు 58 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ రాకెట్ యుగంలోనూ సైకిళ్ల వినియోగం తగ్గిపోలేదు. సైకిళ్లలో కూడా వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. సైకిళ్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. తాజాగా పంజాబ్ కు చెందిన గురుసౌరభ్ సింగ్ అనే వ్యక్తి దృవ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వెర్షన్ కిట్ ను తయారు చేశాడు.
Read: LIVE: నరసాపురంలో పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ
ఈజీ మూవబుల్ కిట్ ఇది. ఈ కిట్‌ను సైకిల్ మధ్యలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎలాంటి వెల్డింగ్ వర్స్ అవసరం లేదని గురుసౌరభ్ సింగ్ పేర్కొన్నారు. ఈ కిట్ ఫైర్, వాటర్ ప్రూఫ్ తో తయారు కాబడిందని కుస్రాబ్ సింగ్ పేర్కొన్నారు. కాగా, కుస్రాబ్ సింగ్ తయారు చేసిన ఈ ఇన్నోవేటివ్ ఇ సైకిల్ గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఇలాంటి ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్ ను ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరవలిసిందేనని అన్నారు.