ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఫొటో ఇప్పుడు చర్చగా మారింది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి అమర్నాథ్ రెడ్డి కలిసి ఉన్న ఫొటో.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే, పవన్‌పై అమర్నాథ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే.. ఇది నెట్టింట్లో ప్రత్యక్షమై తెగ తిరిగేస్తోంది.. ఇక, మంత్రిపై అమర్నాథ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. పవన్‌పై ఇంతలా విరుచుకుపడే నీవు.. ఆయనతో కలిసి ఫొటో ఎందుకు తీయించుకున్నావు అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు..…
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సోషల్ మీడియా రంగంలోకి అడుగపెట్టారు. ఆయన తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్లో వాటాను కొనుగోలు చేశారు. ఈ మేరకు మార్చి 14 నాటికి 9.2 శాతం వాటాను ఎలన్ మస్క్ దక్కించుకున్నారు. ట్విట్టర్‌కు సంబంధించి మస్క్ 7,34,86,938 షేర్లు కొనుగోలు చేసినట్లు అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తెలిపింది. దీంతో ట్విట్టర్ షేర్ల విలువ 28 శాతం పెరిగింది. ట్విట్టర్ షేర్ల వాల్యూ ప్రస్తుతం…
ఐపీఎల్ మ్యాచ్‌లు నెమ్మదిగా రసపట్టును తలపిస్తున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్ తేలిపోయినా.. సూపర్ సండేనాడు జరిగిన రెండు మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. తొలుత ముంబై-ఢిల్లీ మ్యాచ్, అనంతరం బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ ఉర్రూతలూగించాయి. ఈ రెండు మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిపించాయి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయేలా కనిపించగా.. లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ పోరాడి తమ జట్టును గెలిపించారు. ముఖ్యంగా లలిత్ యాదవ్ 48 పరుగులతో అజేయంగా నిలిచి ఢిల్లీ…
ఎన్నో ఆశలతో న్యూజిలాండ్ వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టు రిక్త హస్తాలతో స్వదేశానికి వచ్చేస్తోంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆదివారం నాడు దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలై.. తద్వారా వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మహిళా క్రికెట్ టీమ్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఓడినప్పటికీ చివరి వరకూ మన మహిళలు పోరాడిన తీరు అద్భుతమని రాహుల్ గాంధీ కొనియాడారు. ప్రపంచకప్…
సంతకం పెట్టడంలో ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అయితే అందరూ సాధారణంగా వారి పూర్తి పేరును సంతకంగా పెట్టలేరు. అందుకే సంతకం చేసే సమయంలో తమ పేరును కుదిస్తారు. అయితే సంతకం అనేది సులువుగా ఉంటే సులువుగా కాపీ చేసే ప్రమాదం ఉంది. దీంతో సంతకం అర్థం కాకుండా పెట్టడం కూడా ఒక ఆర్ట్ అని చెప్పవచ్చు. ఈ విషయంలో కర్ణాటకలో పనిచేసే సబ్‌రిజిస్టర్ శాంతయ్య ప్రత్యేకంగా నిలిచారు. దీంతో ఆయన సంతకాన్ని ఏకంగా యునెస్కో అద్భుతమైన…
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన నటించిన భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో పలు సమస్యలు ఎదురైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిక్కెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం, అభిమానుల మధ్య వార్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు. ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభై…
జూలో ఉండాల్సిన జంతువులు రోడ్డుమీదకు వస్తే ఎలా ఉంటుంది. ఆ జంతువు ఏమీ చేయకపోయినా, దాని ఆకారం, దాని స్వభావంతో ప్రజలు భయపడి పరుగులు తీస్తారు. అమెరికా వంటి దేశాల్లో జూలో ఉండే మొసళ్లు వంటివి అప్పుడప్పుడూ రోడ్డు మీదకు వస్తుంటాయి. వాటిని చూసి ప్రజలు పెద్దగా ఆశ్చర్యపడకపోయినా వాటి నుంచి జాగ్రత్తగా తమను తాము రక్షించుకుంటూ ఉంటారు. అయితే, ఓ జూ నుంచి వ్యాన్‌లో మరో చోటకి మొసలిని తరలిస్తుండగా హఠాత్తుగా అ మొసలి వ్యాన్…
అపాయం కలిగినపుడే ఉపాయం ఆలోచించాలి. మెదడు షార్ప్‌గా పనిచేయాలి. లేదంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్రమాదంలో చిక్కకున్నామని తెలిసిన వెంటనే ఏం చేయాలో తెలియక కాళ్లు చేతులు వణికిపోతాయి. ఆ సమయంలో ఆలోచనలు ఆగిపోతాయి. పొంచిఉన్న ప్రమాదం దూరంగా ఉన్నప్పటికీ దగ్గరికి వచ్చేస్తుందని భావించి తప్పించుకోలేక దానికి చిక్కి జీవితాన్ని నాశనం చేసుకుంటాము. Read: Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా? అయితే, బీహార్‌లోని…
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగింది.. అయితే, యుద్ధం కంటే ముందుగా.. సైబర్ దాడి రూపంలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడినట్టు తెలుస్తోంది.. సైబర్ అటాక్‌లు, హ్యాకింగ్ చేయడంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానం అపారం అనేది ఓపెన్ సీక్రెట్.. రష్యా సైబర్ దాడులతో ఉక్రెయిన్ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది.. ప్రభుత్వ వెబ్ సైట్లు అన్నీ హ్యాక్ అయ్యాయి.. ఫలితంగా ఉక్రెయిన్ జనజీవనం స్తంభించి పోయింది.. ఏటీఎంల నుంచి కరెన్సీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా చేసినట్టు వార్తలు వచ్చాయి.. మరోవైపు…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం నలుమూలలా ఏమి జరుగుతున్నా క్షణాల్లోనే తెలిసిపోతుంది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో పెళ్లిళ్లు వివిధ రకాలుగా జరుగుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి అని అర్థం ఉంది. పెళ్లికి ముందు చాలా ప్రాంతాల్లో బరాత్ జరుగుతుంది. ఈ బరాత్‌లో నూతన వధూవరులు డ్యాన్స్ చేస్తుంటారు. డుగ్గుడుగ్గు బెల్లెట్టు బండి సాంగ్ లో వధువు వేసిన డ్యాన్స్ అప్పట్లో ఇంటర్నెట్లో సంచలంగా మారింది. తాజాగా ఓ నూతన వధువు బాంగ్రా డ్యాన్స్‌ను తనదైన…