ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
Vijaysai Reddy Press meet on Sharmila: వైవీ సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రముఖుల గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. షర్మిలమ్మ ట్వీట్ లో, ప్రెస్ మీట్ లో నాపేరు, కేవీపీ పేరు ప్రస్తావించారు. అయితే, షర్మిలమ్మకు కొన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం ఉందని, షర్మిల ప్రెస్ మీట్ లో 95% జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే అని అర్థం అవుతుందని తెలిపారు. విజయమ్మ కన్నీళ్లు…
వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఉంటుందని ఆరోపించారు.
టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారిందని వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి పేర్నినానితో కలిసి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్ జైలుకు వెళ్ళటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులు కారణం అని అన్నారు. ఆ కేసుల్లో భాగంగా ఈడీ విచారణ చేసి ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది.. ట్రాన్స్‌ఫర్ చేయద్దు అని హైకోర్టు చెప్పినా షేర్లు ట్రాన్స్‌ఫర్ చేసారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
నాన్ లోకల్ నేతలు జగన్ పై మాట్లాడుతూన్నారు అని మంత్రి రోజా తెలిపారు. విశాఖపట్నం మించిన సభ రాయలసీమలో జరుగుతుంది.. టీడీపీ అధినేత చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నాడు.. చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేడు.. వైఎస్ షర్మిల నాలుగో కృష్ణుడు లాంటిది..
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాదు ఎవరు వచ్చిన తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయలేరన్నారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళేవారని ప్రశ్నించారు. రమ్మనండి ఛాలెంజ్ చేస్తున్నాం.. తమతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తామని తెలిపారు. తెలంగాణలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఆంధ్రాకు వచ్చి ఆమె మాట్లాడితే ఎలా అని దుయ్యబట్టారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ లో తన సోదరి షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు సతీసమేతంగా హాజరయ్యారు. వైఎస్ రాజారెడ్డి, ప్రియ అట్లూరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు.