YS Viveka murder case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు.. సార్వత్రిక ఎన్నికల వేళ చర్చగా మారింది.. అధికార, విపక్షాలకు చెందిన నేతలు అందరూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనే ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు.. ముఖ్యంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని.. విపక్షాలు అన్నీ ఈ విషయంలో టార్గెట్ చేసిన ఆరోపణలు గుప్పిస్తున్నాయి.. ఈ తరుణంలో.. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.. వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దన్న కడప కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, దగ్గుబాటి పురంధేశ్వరి.. వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించవద్దన పేర్కొంది కోర్టు..
కాగా, సార్వత్రిక ఎన్నికల వేళ.. వైఎస్ వివేకా హత్యపై ఆరోపణలు, విమర్శలు గుప్పింజుకుంటుండగా.. వైఎస్ వివేకా హత్య ప్రస్తావనపై కడప కోర్టును ఆశ్రయించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సురేష్‌బాబు.. ప్రతివాదులుగా వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, రవీంద్రనాథ్‌రెడ్డిని చేర్చారు.. పిటిషనర్ తరుపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించగా.. వైఎస్ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దన్న ఆదేశించింది కోర్టు.. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, దగ్గుబాటి పురంధేశ్వరి ఇలా ఎవరూ వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించవద్దన ఆదేశాలు జారీ చేసింది.