వైఎస్ జగన్, షర్మిల మధ్య తలెత్తిన ఆస్తుల వివాదంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్‌కు షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం కూటమి ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్‌లో ఉంటుందని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ అక్రమ బంధాలు పెట్టుకోవటంలో ముందు ఉంటారు.. ఎన్డీయేలో ఉన్నాను అని చెబుతూ ఇక్కడ కాంగ్రెస్‌తో చెట్టా పట్టాలు, చెలిమి ఉంటుదని అన్నారు. ఏపీలో వింత రాజకీయాలు అన్నీ కనపడుతున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలో సంస్థలు ఏర్పాటు చేసినప్పుడు షర్మిల ఆమె భర్తకు కూడా వాటాలు ఉండాలి కదా అని అన్నారు. వైఎస్సార్ ఆ రోజునే షర్మిల, అనిల్ పేర్లు డైరెక్టర్లుగా ఉండాలని చెబితే ఉండేవి కదా అని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలు కొనసాగించాలని నిజంగా అనుకుంటే చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారా, కలిసి ప్రయాణం చేస్తారా అని ప్రశ్నించారు.
YV Subba Reddy: టీడీపీ కుట్రలో షర్మిల పావులా మారింది..
వైఎస్‌ను ప్రేమించే వారు అందరూ ఇప్పటికే చంద్రబాబును ద్వేషిస్తున్నారు.. గతంలో షర్మిల పాదయాత్ర చేస్తా అన్నపుడు తాను జైలుకి వెళ్లి జగన్‌తో అభ్యంతరం వ్యక్తం చేశానని పేర్ని నాని తెలిపారు. ఇపుడు జరుగుతున్న పరిణామాలపై అనేక అనుమానాలు అప్పుడే వ్యక్తం చేసినా అలాంటిది ఏం జరగదన్నారు జగన్.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న జగన్ 4 ఆస్తుల్లో 40 పైసల వాటా కోసం కక్కుర్తి పడతాడా అని అన్నారు. ఎవరినైనా వాడుకోవటంలో చంద్రబాబు ముందు వరుసలో ఉంటారని పేర్ని నాని ఆరోపించారు.
Tamil Nadu: దళపతి విజయ్‌తో డీఎంకేకి కొత్త చిక్కులు.. ఎన్నికలకు సమాయత్తం..